RAMCHARAN:రామ్ చరణ్ బర్త్ డే రోజు ధరించిన షర్ట్ ఖరీదు ఎంతో తెలిస్తే మెంటలెక్కిపోతారు..

Posted by venditeravaartha, March 28, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

సోషల్ మీడియా బాగా విస్తరించి పోతున్న ఈ రోజుల్లో సెలెబ్రెటీ లు చేసే చిన్న చిన్న విషయాలను సెన్సేషన్ గా చేస్తున్నారు ,దానికి తోడు ఏదైనా ఫంక్షన్ లోనో లేక బయట వెళ్ళినపుడో వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ నుంచి వారు తినే తిండి వరకు ప్రతిదీ ఒక సెన్సషనల్ న్యూస్ అన్నట్టు చిత్రీకరిస్తుంటారు. ఇప్పుడు అలాంటిదే ఒక న్యూస్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే వేడుకలు హైదరాబాద్‏లో గ్రాండ్‏గా జరిగాయి. ఈ సెలబ్రెషన్స్‏కు టాలీవుడ్ సినీ ప్రముఖులు.. దర్శకనిర్మాతలు.. నటీనటులు పాల్గోని సందడి చేశారు. ఇక వారం రోజుల ముందు నుంచే సోషల్ మీడియాలో సెలబ్రెషన్స్‏తో రచ్చ చేశారు మెగా అభిమానులు. చెర్రీకి సంబంధించిన త్రోబ్యాక్ ఫోటోస్.. లేటేస్ట్ ఫోటోస్ నెట్టింట షేర్ చేస్తూ.. తమ సంతోషాన్ని తెలియజేశారు. ఇక నైట్ పార్టీలో విజయ్ దేవరకొండ, ఎస్ఎస్ రాజమౌళి, ఎంఎం కీరవాణి, కాజల్ దంపతులు, దర్శకనిర్మాతలు, ప్రశాంత్ నీల్ తదితరులు పాల్గోన్నారు. అయితే బర్త్ డే రోజున ఉదయం నుంచే తన ఇంటికి వచ్చిన అభిమానులను కలుసుకున్నారు చరణ్. ఇందుకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట చక్కర్లు కొట్టాయి. అయితే ఇందులో అందరి దృష్టి చరణ్ వేసుకున్న షర్ట్ పై పడింది.

చరణ్ వేసుకున్న షర్ట్ గురించి తెగ మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఆ షర్ట్ బ్రాండ్ ఏంటీ ?.. ధర ఎంత ? అని తెలుసుకోవడానికి తెగ ఆసక్తి చూపిస్తున్నారు. లైట్ బ్లూ కలర్‏లో ప్యాచ్ వర్క్‏తో ఉన్న షర్ట్ గురించి గూగుల్ లో సెర్చ్ చేయగా.. ఫార్ ఫెచ్ అనే షాపింగ్ వెబ్‏సైట్ లో కనిపించింది. జున్యా వటనాబి ప్యాచ్ వర్క్ డీటైల్ షర్ట్ పేరుతో అందుబాటులో ఉన్న ఈ షర్ట్ ధర $703 డాలర్లు. అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.57723.33 అన్నమాట. ఇక ఈ రేట్ ని చూసి అభిమానులు షాకవుతున్నారు.కొందరు పాజిటివ్ గా స్పందిస్తుంటే ,మరి కొందరు ఆ షర్ట్ హైదరాబాద్ కోటి లో 100 కి 3 దొరుకుతాయి అంటూ జోక్ లు వేస్తున్నారు.

554 views