Ram Charan : సురేఖ కొణిదెల అల్లు రామలింగయ్య గారి కూతురుగా మెగాస్టార్ చిరంజీవి భార్యగా రాంచరణ్ తల్లిగా అందరికీ సుపరిచితమే, చిరంజీవి గారి కుటుంబంలో ఎంతమంది స్టార్స్ వచ్చినా కూడా ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు సురేఖ గారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కువ గా తన వదిన సురేఖ గురించి చాలా మూవీ ఫంక్షన్స్ లో చెప్పుకొచ్చారు తనను ఎప్పుడు ఎంకరేజ్ చేయాలన్నా తన వదినే ముందుంటుందని కూడా పవన్ కళ్యాణ్ చాలా సందర్భాల్లో చెప్పారు.ఈమె తన కొడుకు రామ్ చరణ్ గురించి ఒక ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు వాటి గురించి ఇప్పుడు చూద్దాం.
రామ్ చరణ్ సినీ ఇండస్ట్రీలో మెగావారసుడిగా అడుగుపెట్టి మొదట్లో తీసిన సినిమాల్లో కొన్ని ప్లాప్ అందుకున్న తర్వాత నటనలో ప్రావీణ్యం సంపాదించి తనకంటూ ఒక ప్రత్యేక అభిమానాన్ని సంపాదించుకున్నారు చరణ్. మొదటి చేసిన చిరుత సినిమా నుండి మొన్న వచ్చిన ఆర్ ఆర్ ఆర్ వరకు ప్రతి సినిమాలోనూ కొత్త నటనను, కొత్త నటుడిని ప్రేక్షకులకు పరిచయం చేస్తూనే ఉన్నాడు.
తండ్రికి తగ్గ తనయుడిగా రాంచరణ్ నటనతో పాటు విభిన్న పాత్రలు కూడా చేస్తూ ముందుకు దూసుకుపోతున్నారు రంగస్థలం మూవీలో ఒక సాధారణ రైతుబిడ్డగా నటించి మెప్పించారు ఇక వినయ్ విధేయ రామా,ధ్రువ వంటి సినిమాల్లో యాక్షన్ మాస్ ఎలివేన్స్ తో ప్రేక్షకులకు దగ్గరయ్యారు రామ్ చరణ్. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో మరో రామ్ చరణ్ ని ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఆస్కార్ స్థాయికి కూడా ఎదిగాడు రామ్ చరణ్. దేశ విదేశాల్లో రామ్ చరణ్ తండ్రి చిరంజీవి అని చెప్పుకునే స్థాయికి ఎదిగాడు. ఇక ఎంత ఎదిగినా తన తల్లి కొడుకుగా సురేఖ సూచనలు సలహాలు పాటిస్తుంటాడు.
సురేఖ గారు తన కొడుకు రామ్ చరణ్ నటించిన ఒక సినిమా అసలు ఇష్టం లేదని చెప్పారు అలాంటి సినిమాని మళ్లీ చేయొద్దని రామ్ చరణ్ కు సూచించారు ఇంతకీ ఆ మూవీ ఏంటి అంటే రామ్ చరణ్ పోలీస్ గా నటించిన తుఫాన్ సినిమ. రామ్ చరణ్ పోలీస్ గా బాగా నటించినప్పటికీ, ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. స్టోరీ రామ్ చరణ్ క్యారెక్టర్రైజేషన్ సురేఖకు నచ్చలేదుట అందుకే ఇలాంటి సినిమాలు ఇంకెప్పుడు తీయద్దని తన కొడుక్కి చెప్పారుట సురేఖ ఈ సినిమా అమితాబచ్చన్ హీరోగా చేసిన జంజీర్ మూవీ రీమేక్ గా వచ్చింది కానీ తెలుగులోనే కాక హిందీలో కూడా ఇది పెద్దగా రాణించలేదు. రాంచరణ్ సినిమాలోని ఇది పెద్ద ప్లాప్ గా చెప్పుకోవచ్చు.