తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారి “యువగళం” పాదయాత్రకు పెదపూడి నుండి సర్పవరం జంక్షన్ వరుకు నల్లమిల్లి, బొడ్డు ఆధ్వర్యంలో దాదాపుగా 2000 బైక్ లతో ర్యాలీగా భారీగా తరలివెళ్తున్న టీడీపీ, జనసేన శ్రేణులు. అడుగడుగున విజయ సంకెంతం చూపిస్తూ ప్రజలు, మహిళలు అభివాదం. ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర రోజు రోజుకి ప్రజల్లో విశేష స్పందన వస్తుంది అంతే కాదు ముక్యంగా యువకుల్లో నూతన ఉత్తేజం నింపుతుంది అని చెప్పడం లో సందేహం లేదు తెలుగుదేశం పార్టీ రాజానగరం నియోజకవర్గ ఇంచార్జ్ మరియు రాష్ట్ర కార్యదర్శి బొడ్డు వెంకటరమణ చౌదరి మాట్లాడుతూ యువగళం ఎంతో ప్రజాధారణ పొందుతుంది అని రానున్న రోజుల్లో టీడీపీ అధికారం లోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు అని అన్నారు జగన్ పాలన వల్ల ప్రజలు ఇబ్బందులు పాలు అవుతున్నారు అని ప్రజలు వాపోతున్నారని చెప్పారు 2024 లో జరిగే ఎన్నికల్లో వైసీపీ కి ఓటమి తప్పదని చెప్పారు.