Rakul preet singh : షెడ్ కి వెళ్లిపోయిన రకుల్ ప్రీత్ సింగ్! ఆ ఒక్క సినిమా తన కెరీర్ ని నాశనం చేసిందా?

Posted by venditeravaartha, June 3, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

2011 లో కెరటం అనే సినిమా ద్వారా తెలుగు తెర కి పరిచయం అయినా రకుల్ ప్రీత్ సింగ్(Rakul preet singh) ఆ సినిమా తో అంత గుర్తింపు తెచ్చుకోలేదు.2013 లో సందీప్ కిషన్ సరసన నటించిన సూపర్ హిట్ మూవీ వేంకటాద్రి ఎక్సప్రెస్ తో కమర్షియల్ సక్సెస్ తో పాటు మంచి అవకాశాలు కూడా వచ్చాయి 2014 లో యారియాన్ సినిమా తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ అంతగా సక్సెస్ కాలేదు 2014 నుంచి 2017 వరకు 14 తెలుగు సినిమా ల లో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగిన రకుల్ ఆ తర్వాత తెలుగు లో అంతగా కనిపించలేదు.

rakul

2014 లో రిలీజ్ అయినా లౌక్యం సినిమా తో రకుల్ ప్రీత్ యొక్క సక్సెస్ స్టార్ట్ అయింది అని చెప్పొచ్చు.ఇక ఆ తర్వాత వరుసగా టాలీవుడ్ స్టార్ హీరో ల తో నటించే ఛాన్స్ కొట్టేసిన రకుల్ రామ్ చరణ్ తో ధ్రువ ,అల్లు అర్జున్ తో సరైనోడు ,జూనియర్ ఎన్టీఆర్ తో నాన్నకు ప్రేమతో
వంటి బ్లాక్ బస్టర్ సినిమా ల లో నటించారు.అప్పటి వరకు మంచి సక్సెస్ ల తో బిజీ గా ఉన్న రకుల్ 2017 లో మహేష్ బాబు గారి స్పైడర్ మూవీ నుంచి ప్లాప్ ల ను చూసారు.

check movie

ఇక అప్పటి నుంచి తమిళ్ ,హిందీ సినిమా ల లో నటిస్తూ బిజీ అయినా రకుల్ రెండు సంవత్సరాలు గ్యాప్ తర్వాత నాగార్జున గారితో మన్మధుడు 2 లో నటించారు.ఈ సినిమా తన కెరీర్ లో తెలుగు లో లాస్ట్ సినిమా గా చెప్పుకోవచ్చు.ఆ తర్వాత నితిన్ తో చెక్ సినిమా లో చేసినప్పటికీ అందులో తాను సెకండ్ హీరోయిన్.మన్మధుడు సినిమా డిజాస్టర్ కావడం తో అందులో రకుల్ క్యారెక్టర్ మీద కూడా విమర్శలు వచ్చాయి.దానితో తెలుగు లో అవకాశాలు తగ్గిపోయాయి.ఇప్పుడు హిందీ లో వెబ్ సిరీస్ లు కొన్ని సినిమా లో నటిస్తున్న అవి సక్సెస్ కావడం లేదు.తెలుగు లో టాప్ హీరోయిన్ గా ఎదిగిన రకుల్ తన కెరీర్ ని ఒక్క సినిమా తో నాశనం చేసుకుంది అని కొందరి అభిప్రాయం.కానీ తెలుగు లో వచ్చిన ఫేమ్ తో బాలీవుడ్ కి వెళ్లి అక్కడ సక్సెస్ అవ్వాలి అనేది రకుల్ ప్లాన్ అని కానీ అది వర్క్ కాలేదు.

manmadhudu 2

1530 views