రాజమండ్రి జిల్లా తెలుగుదేశం పార్లమెంట్ విస్తృతస్థాయి సమావేశం

Posted by venditeravaartha, August 27, 2025
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

రాజానగరంలో టీడీపీ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నిర్వహించిన రాజమండ్రి జిల్లా తెలుగుదేశం పార్లమెంట్ విస్తృతస్థాయి సమావేశం

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి ఘన నివాళులు అర్పించిన టీడీపీ నాయకులు

ముఖ్య అతిధి గా పాల్గొన్న సమాచార & పౌరసంబంధాల మంత్రి గృహనిర్మాణ శాఖ మంత్రిశ్రీ కొలుసు పార్థసారథి గారు మరియు చిలకలూరిపేట నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ పత్తిపాటి పుల్లారావు గారు కనిగిరి నియోజవర్గం ఎమ్మెల్యే శ్రీ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి గారు*

ఈ కార్యక్రమంలో సమాచార & పౌరసంబంధాల మంత్రి గృహనిర్మాణ శాఖ మంత్రిశ్రీ కొలుసు పార్థసారథి గారు మాట్లాడుతూ

గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేస్తూ పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించాను. అలాగే పార్టీ భవిష్యత్ కార్యాచరణపై టీడీపీ నేతలకు, కార్యకర్తలకు మరియు అభిమానులకు దిశా నిర్దేశం చేయడం జరిగింది.

చిలకలూరిపేట నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ పత్తిపాటి పుల్లారావు గారు మాట్లాడుతూ రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు జగన్ కు లేవు రాజమహేంద్రవరం పార్లమెంట్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సహా అనుబంధ సంఘాలు, ఇతర కీలక పదవుల భర్తీపై ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పార్టీ శ్రేణుల అభిప్రాయాలు తీసుకోవడం జరిగిందని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. పార్టీ అధినాయకత్వం నియమించిన త్రిసభ్య కమిటీలో సభ్యులైన మంత్రి కొలుసు పార్థసారథి, సీనియర్ శాసనసభ్యులు ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, తాను నేడు స్థానిక పార్టీ కార్యాలయంలో టీడీపీ శ్రేణులతో కీలక సమావేశం నిర్వహించామని, వినాయక చవితి తర్వాత పార్టీ అధిష్టానం తన నిర్ణయాలు వెలువరిస్తుందని ప్రత్తిపాటి స్పష్టంచేశారు.

రాజమహేంద్రవరం పార్లమెంట్ విస్తృతస్థాయి సమావేశానంతరం ప్రత్తిపాటి విలేకరులతో మాట్లాడారు. 17 అనుబంధ సంఘాలు, 54 కులసంఘాలకు నూతననియామకాలు ఉంటాయన్నారు. పార్టీకోసం కష్టపడినవారికి న్యాయం చేస్తూ, పదవులకు వన్నెతెచ్చేవారిని, పార్టీ గౌరవం పెంచి, ప్రజలతో సేవాభావంతో వ్యవహరించి పార్టీ ప్రతిష్ఠ పెంచేవారికే పదవుల్లో తగిన ప్రాధాన్యత ఉంటుందని ప్రత్తిపాటి తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాజమండ్రి సిటీ శాసన సభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు ) గారు, రాజమండ్రి రూరల్ శాసన సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, అనపర్తి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి నల్లమల్లి మనోజ్ రెడ్డి గారు, స్కిల్ డెవలప్మెంట్ బూరుగుపల్లి శేషారావు గారు, మాజీ mlc ఆదిరెడ్డి అప్పారావు గారు,గోపాలపురం శాసన సభ్యులు మద్దిపాటి వెంకటరాజు గారు, కొవ్వూరు శాసన సభ్యులు ముప్పిడి వెంకటేశ్వరావు గారు, అనపర్తి శాసన సభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు, కొవ్వూరు టీడీపీ నాయకులు కొత్తపల్లి ఆశిష్ లాల్ గారు, అధిక సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు. పాల్గొన్నారు.

Tags :
189 views