Rajamouli Varanasi: ‘వారణాసి’తో ఇండియన్ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లబోతున్న రాజమౌళి… ఒక్కటవుతున్న స్టార్ హీరోలు!

Posted by venditeravaartha, December 25, 2025
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి పేరు వినగానే సినిమా స్థాయి మారిపోతుంది. ఇండియన్ సినిమాకు గ్లోబల్ గుర్తింపు తీసుకొచ్చిన ఈ దర్శకుడు ఇప్పుడు తన తదుపరి పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ ‘వారణాసి’ తో మరోసారి సంచలనం సృష్టించేందుకు సిద్ధమయ్యాడు.

ఈ భారీ చిత్రానికి సూపర్ స్టార్ మహేష్ బాబు ను హీరోగా ఎంపిక చేయడం ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారి తీసింది. తెలుగు రాష్ట్రాల్లో అపారమైన అభిమాన గణం ఉన్నప్పటికీ, ఇతర భాషల్లో మార్కెట్ పరంగా ఇది ఒక పెద్ద ఛాలెంజ్ అనే అభిప్రాయం ఉంది. అయినా సరే, రాజమౌళి లాంటి దర్శకుడు చేతుల్లో ఈ ఛాలెంజ్ ఒక అడ్వాంటేజ్‌గా మారుతుందని సినీ వర్గాలు అంటున్నాయి.

₹1100 కోట్ల బడ్జెట్… ₹3000 కోట్ల టార్గెట్!

సుమారు ₹1100 కోట్ల భారీ వ్యయంతో తెరకెక్కుతున్న ఈ సినిమా, విడుదలైన తర్వాత ₹3000 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తుందనే అంచనాలు ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తున్నాయి. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి రాజమౌళి ఇప్పటి నుంచే డిఫరెంట్ ప్రమోషనల్ స్ట్రాటజీలను అమలు చేస్తున్నట్టు సమాచారం.

ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో టాలీవుడ్ శక్తి ప్రదర్శన

‘వారణాసి’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను టాలీవుడ్ చరిత్రలోనే ఒక గుర్తుండిపోయే ఈవెంట్‌గా మార్చాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడట.
ఈ వేడుకలో తెలుగు సినిమా స్టార్ హీరోలందరినీ ఒకే వేదికపైకి తీసుకురావాలని ఆయన భావిస్తున్నట్టు టాక్. మహేష్ బాబుతో ఎవరికీ పెద్ద విభేదాలు లేకపోవడం, ఆయన వ్యక్తిత్వంపై ఇండస్ట్రీలో మంచి అభిప్రాయం ఉండటంతో—
స్టార్ హీరోలందరూ “రాజమౌళి – మహేష్ బాబు కోసం తప్పకుండా వస్తాం” అంటూ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

2027 సమ్మర్ కానుకగా ‘వారణాసి’

ఈ సినిమాను 2027 సమ్మర్ స్పెషల్ రిలీజ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటివరకు మూడు షెడ్యూల్స్ పూర్తయ్యాయి, త్వరలోనే నాలుగో షెడ్యూల్ కూడా ప్రారంభం కానుంది

Tags :
144 views