Rajamouli:ఇండియన్ అవెంజర్స్ గా రాజమౌళి గారి మహాభారతం ! 10 పార్ట్ లు గా తీయనున్న రాజమౌళి

Posted by venditeravaartha, May 9, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

ఇండియన్ సినిమా లోనే కాకుండా ప్రపంచ సినీ చరిత్ర లోనే అపజయం ఎరుగని అతి తక్కువ మంది డైరెక్టర్ ల లో ఒకరు ‘రాజమౌళి’,స్టూడెంట్ నెంబర్ 1 తో మొదటి సినిమా తోనే సూపర్ హిట్ సాధించిన రాజమౌళి గారు రీసెంట్ గా రిలీజ్ అయినా ఆర్ ఆర్ ఆర్ తో ఇండియన్ సినిమా ని ప్రపంచ మ్యాప్ లో ఉంచాడు.22 సంవత్సరాల సినీ కెరీర్ లో కేవలం 12 సినిమా లు డైరెక్ట్ చేసిన రాజమౌళి గారు 3 ఇండస్ట్రీ హిట్ సినిమా ల కి డైరెక్ట్ వహించారు.

అయితే ప్రతి హీరో కి ,డైరెక్టర్ కి తమ డ్రీం ప్రాజెక్ట్ అంటూ ఒకటి ఉంటుంది ,రాజమౌళి గారికి కూడా తన చిరకాల కోరిక గా అనుకుంటున్నా ప్రాజెక్ట్ ‘మహాభారతం’,భారత దేశ ఇతిహాసాల లో ముఖ్యమైన మహాభారతం ని సినిమా గా తీయాలి అనేది రాజమౌళి డ్రీం ప్రాజెక్ట్,ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో రాజమౌళి గారు మహాభారతం మూవీ గురించి మాట్లాడుతూ ‘మహాభారతం ‘ అనేది నా చిరకాల కోరిక ఈ సినిమా ని తీయాలి అంటే భారతదేశము లో ఉన్న అన్ని భాషల లో ఉన్నటువంటి వెర్షన్స్ ని చదవాలి ,వాటిని స్క్రిప్ట్ కిందకి మార్చాలి అంటే సంవత్సరాలు సమయం పడుతుంది,దానికి తోడు నా మైండ్ లో ఉన్న మహాభారతం ని తీయాలి అంటే ఇప్పుడు ఉన్న టెక్నాలజీ సరిపోదు ,నాకు ఉన్న ఎక్స్పీరియన్స్ కూడా సరిపోదు.

ఒక సారి ఈ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేస్తే ఇక ఇదే నా చివరి సినిమా అవుతుంది,అయితే 266 ఎపిసోడ్ ల తో టెలివిజన్ లో ప్రసారం అయినా మహాభారతం ని సినిమా గా తీయాలి అంటే కనీసం 10 పార్ట్ లు అయినా తీయాల్సి వస్తుంది అన్నారు.అన్ని బాగుంటే రాజమౌళి ఒక సినిమా పూర్తి చేయాలి అంటే రెండు ,మూడు సంవత్సరాలు పడుతుంది ,అలాంటిది అంత భారీ స్థాయి లో మహాభారతం తీయాలి అంటే 10 ,15 సంవత్సరాలు అయినా పట్టొచ్చు.

888 views