SSRMB: మహేష్ ఫ్యాన్స్ కి ఫ్యూజులు ఎగిరిపోయే రేంజ్ అప్డేట్ చెప్పిన రాజమౌళి!

Posted by venditeravaartha, March 19, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

SSMB29: మహేష్ బాబు తాజా సినిమా శ్రీలీల హీరోయిన్ గా నటించిన గుంటూరు కారం సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గుంటూరు కారం సినిమా 200కోట్లకు పైగా వసూల్ చేసింది. ఇక ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో సంచలన విజయం అందుకున్న రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబు తో భారీ పాన్ ఇండియా సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.

ఇప్పటికే ఈ సినిమా కథ పూర్తయ్యిందని స్టార్ రైటర్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. హాలీవుడ్ సినిమాలను తలదన్నేలా సినిమాను తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. ఈ సినిమాను దాదాపు 1000కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని టాక్ వినిపిస్తుంది.

ఇదిలా ఉంటే…సూపర్ స్టార్ మహేష్ బాబు కొన్ని రోజుల క్రితం జర్మనీ వెళ్లిన సంగతి తెలిసిందే. తన తదుపరి సినిమా దర్శకుడు రాజమౌళితో చేస్తున్న మహేష్ బాబు, ఆ సినిమా కోసమని కొన్ని రోజులు వ్యాయామంలో శిక్షణ తీసుకోవడానికి జర్మనీ వెళ్లారని ఒక టాక్ నడిచింది. అయితే అక్కడ శిక్షణ ముగించుకొని ఇప్పుడు సూపర్ స్టార్ హైదరాబాదు తిరిగి చేరుకున్నారు. ఈసినిమాలో మహేష్ రఫ్ లుక్ లో కనిపిస్తారని తెలుస్తోంది. ఈ సినిమా నుంచి ఏదైనా చిన్న అప్డేట్ కానీ లీక్ కానీ వస్తుంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.

SSMB 29′ వర్కింగ్ టైటిల్‌తో మొదలైన ఈ చిత్రం గురించి రాజమౌళి తాజాగా రియాక్ట్ అయ్యారు. జపాన్‌లో జరిగిన ఆర్ఆర్ఆర్ ప్రత్యేక స్క్రీనింగ్‌కి రాజమౌళి హారయ్యారు. ఈ సందర్భంగా తన రాబోయే చిత్రం గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. “నా నెక్స్ట్ మూవీ మొదలైంది. ఇప్పటికే స్క్రిప్ట్ పని పూర్తయింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కానీ ఇంకా క్యాస్టింగ్ పూర్తి కాలేదు. కేవలం హీరోను మాత్రమే సెలక్ట్ చేశాం. ఆయన పేరు మహేష్ బాబు.. తెలుగు యాక్టర్. మీలో చాలా మందికి ఆయన తెలుసు అనుకుంటా. మహేష్ చాలా అందగాడు. వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేసి రిలీజ్ టైమ్‌లో మహేష్‌ను ఇక్కడికి తీసుకువచ్చి మీ అందరికీ పరిచయం చేస్తాను.” అంటూ రాజమౌళి చెప్పారు.

430 views