Raghuvaran: సినిమాల్లోకి రఘువరన్ కొడుకు.. ఆయన ఎలా ఉన్నాడో చూస్తే షాక్ అవుతారు..

Posted by venditeravaartha, June 10, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

సినీ ఇండస్ట్రీకి చెందిన అలనాటి నటుల్లో కొందరు ఎవర్ గ్రీన్ యాక్టర్స్ గా మిగిలిపోయారు. వారి నటనతో నేటితరం ప్రేక్షకులనూ మెప్పిస్తున్నారు. వారు మన మధ్య లేకపోయినా వారి సినిమాలు అలరిస్తూ ఉంటాయి. ఆ వారిలో డిఫరెంట్ విలన్ క్యారెక్టర్ లో నటించి అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించిన యాక్టర్ రఘువరన్ ఒకరు. విలన్ గా.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన రఘువరన్ ప్రస్తుతం మన మధ్య లేకపోవచ్చు. కానీ ఆయన జ్ఞాపకాలు సినీ ఇండస్ట్రీలో అలాగే ఉండిపోయాయి. రఘువరన్(Raghuvaran) సంబంధించి ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఆయన కుమారుడు కూడా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం.

basha movie

రఘువరన్ సినిమాలో నటిస్తుండగానే రోహిణి(Rohini) అని మరో నటిని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ కుమారుడు జన్మించారు. ఆయన పేరు సాయి రిషివరణ్(Rishi varun). ఈయన చదువు పూర్తి చేసుకుని సినిమా రంగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. తల్లి రోహిణి ప్రస్తుతం సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ చొరవతో సాయి రిషి వరుణ్ కూడా సినిమాల్లోకి అడుగు పెడతారని అంటున్నారు. అయితే ఇటీవల సాయి రిషి వరుణ్ సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

rohini actress

తన తల్లితో కలిసి సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth) ను కలిశారు. తండ్రి రఘువరన్ కంపోజ్ చేసిన మ్యూజిక్ ఆల్బమ్ ను సూపర్ స్టార్ తో కలిసి రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా సాయి రిషి వరుణ్ చూసి సినిమా హీరో అవుతారని అందరూ కొనియాడారు .దీంతో ఆయన త్వరలోనే ఇండస్ట్రీలోకి అడుగు పెడతారని అంటున్నారు. అయితే సాయి రిషి వరుణ్ హీరోగా రాణి స్తాడా? లేక తండ్రి బాటలోనే విలన్ గా గుర్తింపు పొందుతాడా? అనేది తెలియాల్సి ఉంది. కొందరు నెటిజెన్లు మాత్రం సాయి రిషి వరుణ్ విలన్ గా చేయాలని సలహాలిస్తున్నారు.

rajinikanth

తండ్రి రఘువరన్ ‘భాషా’ సినిమాతో స్టార్ అయిన విషయం తెలిసిందే. ఇందులో రజినీకాంత్ హీరో . ఆ తర్వాత తెలుగులో పవన్ కళ్యాణ్ నటించిన ‘సుస్వాగతం’ సినిమాతో ఫేమస్ అయ్యారు. చివరి రోజుల్లో రఘువరన్ మద్యానికి బానిసై మరణించారని అంటున్నారు. అయితే ఆర్థిక ఇబ్బందులే మద్యానికి బానిస కావడానికి కారణమయ్యాయని చెప్పుకుంటున్నారు. ఏది ఏమైనా రఘువరన్ సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేకంగా నిలుస్తారు. మరి ఆయన కుమారుడు చిత్ర పరిశ్రమ లోకి వస్తే ఎలా గుర్తింపు పొందుతాడో చూడాలి..

1104 views