Raashi Khanna: ఇంతకు మించిన హాట్ షో ఉంటుందా వైరల్ అవుతున్న రాశీ ఖన్నా గ్లామర్ ఫోటోలు

Posted by venditeravaartha, February 24, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

రాశిఖన్నా ఈ బ్యూటీ అతి తక్కువ కాలంలోనే మంచి ఫెం సంపాదించుకుంది. ఈ అందాల భామా టాలీవుడ్ లో ఊహలు గుసగుసలాడే చిత్రంలో నాగశౌర్యతో జోడి కట్టి ఎంట్రీ ఇచ్చింది. తన మొదటి చిత్రం ఊహలు గుసగుసలాడే మంచి రొమాంటిక్ సినిమా కావడంతో సూపర్ హిట్ అయింది తర్వాత వరుస అవకాశాలతో టాలీవుడ్ లో హంగామా చేసింది. ప్రస్తుతం తెలుగులో అవకాశాలు రాకపోవడం కొంతవరకు తగ్గినట్టే కనిపిస్తుంది. దీనికి కారణం వరల్డ్ ఫేమస్ లవర్, పక్కా కమర్షియల్, థాంక్యూ వంటి చిత్రాలు వరుసగా ఫ్రాక్ అవడమే. ఇక సినిమాలకు కొంత గ్యాప్ వచ్చేసరికి ఒక ఇంటర్వ్యూలో పెళ్లి చేసుకోబోతున్నారా! అని అడిగారట దానికి ఈ భామ అటువంటి ఆలోచన లేదు కొంచెం గ్యాప్ ఇచ్చాను మరల కొన్ని ప్రాజెక్టులు ఓకే చెప్పాను తిరిగి బిజీ లైఫ్ని గడపబోతున్నానని చెప్పారు.

రీసెంట్ గా ఈనెల 10న ప్రైమ్ లో రిలీజ్ అయిన పార్జీ కి మంచి రెస్పాన్స్ రావడంతో తన అడుగులు మరలా విజయం వైపు పడుతున్నాయి అని సంబరపడిపోతుంది. అయితే పార్జి ఒక క్రైమ్ డ్రామాగా రూపొందించారు విజయ్ సేతుపతి, సాహిద్ కపూర్ ప్రధాన పాత్ర పోషించారు ఇందులో విజయ్ సేతుపతికి సహాయం చేసే ఆర్బిఐ ఆఫీసర్ గా మేఘ అనే పాత్రలో రాసి నటించారు. రాశిఖన్నా ఇండస్ట్రీకి బాలీవుడ్ తో పరిచయం అయినప్పటికీ తనకు మంచి గుర్తింపు వచ్చింది మాత్రం టాలీవుడ్ సినిమాలతోనే తనకు బాగా గుర్తింపు తెచ్చిన సినిమాలు ఊహలు గుసగుసలాడే, తొలిప్రేమ, జై లవకుశ, ప్రతిరోజు పండగే వంటి చిత్రాలు. ప్రస్తుతం రాసి యోధ అనే బాలీవుడ్ సినిమాలో నటిస్తున్నారు సిద్ధార్థ మల్హోత్రా హీరోగా చేస్తున్న ఈ సినిమా జూలైలో రిలీజ్ కాబోతుంది.

ఊహలు గుసగుసలాడే తో తనకంటూ ఒక ప్రత్యేకతను సాధించిన ఈ భామ సోషల్ మీడియాలో వైరల్ పిక్స్ షేర్ చేస్తూ అందరి మతి పోగొడుతుంది అనే చెప్పాలి సినిమా సినిమా కు కొత్త అవకాశాలను పరిచయం చేస్తున్న ఈమె ఎంతో ఆక్టివ్ గా సినిమాల్లో రోల్ చేస్తుంది అని చెప్పాలి రాశి కన్నా కు వరుస సినిమా అవకాశాలు వస్తున్నా అతి పెద్ద హిట్ ఈ భామ చేతిలో పడలేదు అనేది వాస్తవమే అంధుకే ఈమె మంచి హిట్ కోసం వేచి చూస్తుంది అని చెప్పాలి చూద్దాం రాశి కన్నా ఈ రకంగా దూసుకుపోతుందో చూద్దాం.

Tags :
1198 views