సినిమా ఇండస్ట్రీలో బాలకృష్ణ ( Balakrishna )గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డైలాగ్ డెలివరీలో ఆయనకు మించిన నటుడు లేరని చాలా మంది నటులే అంటుంటారు. సినిమాల్లో నటిస్తూనే రియల్ లైఫ్ లోనూ బాలయ్య ప్రత్యేకంగా నిలుస్తున్నాడు. ఆయన సొంతంగా బసవతారకం అనే ఆసుపత్రిని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఎంతో మంది పేదలకు తక్కువ ఖర్చుతో క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయిస్తున్నారు. అయితే బాలకృష్ణ గురించి నటుడు, డైరెక్టర్ ప్రియదర్శిని రామ్ సంచలన కామెంట్స్ చేశారు. బాలకృష్ణకు కొన్ని విషయాలు నచ్చవని ఒకరు చేసిన పనికి బాలకృష్ణ తీవ్రంగా కోప్పడ్డారని అన్నారు. అలాగే తనకు ఓ విషయంలో మెసేస్ చేస్తే బాలయ్య ఫోన్ చేసి అన్న మాటలకు షాక్ అయ్యానని అన్నారు.
ప్రియదర్శిని రామ్..ఈ పేరు ఇండస్ట్రీలో పెద్దగా పరిచయం చేయనక్కర్లేదు. ఓ దినపత్రికలో కాలమిస్ట్ గా పరిచయం అయిన ఆయన ఆ తరువాత సినిమాల్లోకి వచ్చారు. పలు సినిమాల్లో నటించారు. ‘మనోడు’ అనే సినిమాకు డైరెక్షన్ గా చేశాడు. ఈ సినిమాకు అయన అవార్డు కూడా అందుకున్నారు. అయితే ఆ తరువాత ఇండస్ట్రీకి దూరమయ్యాడు. అయితే ఇటీవల ఓ చానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన బాలకృష్ణ గురించి సంచలన కామెంట్స్ చేశారు. బాలకృష్ణ కు నాకు ఎంతో అనుబంధం ఉంది. ఆయన నన్ను ఎప్పూడ బాక్సీ అని పిలిచేవారు. నేను బాక్సర్ కాబట్టి నన్ను అలా పిలిచేవారు. ఇతరులకు సాయం చేయడంలో బాలకృష్ణ ది ప్రత్యేక శైలి. ఏ విషయాన్నైనా సూటిగా చెప్పేస్తాడు. మిగతా హీరోల కంటే బాలకృష్ణ మాత్రం డిఫరెంట్ గా ఉంటాడు. అయితే ఓ సారి ఓ సంఘటన లో బాలకృష్ణ ప్రవర్తన నాకు షాకింగ్ అనిపించింది.
‘బాలకృష్ణ నిర్వహించే బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి విషయంలో ఆయన తీరు ఆశ్చర్యమేసింది. నాకు తెలిసిన ఒకరు బసవతారకం ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. అయితే బిల్లుల డిస్కౌంట్ కావాలని నన్ను అడిగారు. అయితే ఆసుపత్రికి సంబంధించిన విషయంలో ఆయన సంచలన నిర్ణయాలు తీసుకుంటాడు. నేను ఆ వ్యక్తికి సాయం చేయమని కోరాను. ఆయన వెంటనే ‘సాయం చేయమని నన్ను అడుగుతావెందుకు? ఈ ఆసుపత్రి నీదే అనుకో.. ఈ చిన్న్ విషయానికి నాకు మెసేజ్ పెడతావా? పేద వారికోసమేగా ఈ ఆసుపత్రి’.. అని అన్నాడు.. అప్పుడనిపించింది.. బాలకృష్ణ లాంటి గొప్ప మనసు ఇంకెవరికీ లేదని..’ అని ప్రియదర్శిని రామ్ అన్నారు.