PRIYANKA MOHAN:భారీ ఛాన్స్ కొట్టేసిన ‘గ్యాంగ్ లీడర్ ‘ హీరోయిన్

Posted by venditeravaartha, April 12, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

ప్రస్తుతం తెలుగు లో ఉన్న హీరోయిన్ ల లో అందమైన ,బబ్లీ గా కనిపించే హీరోయిన్ ల లో ఒకరు ‘ప్రియాంకా అరుళ్‌ మోహన్’. ప్రియాంక తొలిసారిగా కన్నడ సినిమా ఒంధ్‌ కథే హెళ్ల (2019) ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టింది. తెలుగులో నాని ‘గ్యాంగ్ లీడర్’ (2019) ద్వారా అడుగు పెట్టింది.

ఇప్పుడు ఈమె ఒక భారీ పాన్ ఇండియన్ మూవీ లో కనిపించబోతోంది, అది మరి ఎవరిదో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,సుజీత్ కాంబినేషన్ లో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ OG లో నటించే అవకాశం అందుకుంది. ఏకంగా పవర్ స్టార్ ససన నటించే ఛాన్స్ దక్కించుకుంది.

తాజా సమాచారం ప్రకారం ప్రియాంక మోహన్ కు తెలుగు చిత్ర పరిశ్రమలో భారీ ఆఫర్ దక్కిందని తెలుస్తోంది. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న OG చిత్రం క్యాస్ట్ గా ఎంపికైందని సినీ వర్గాల నుంచి సమాచారం.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. త్వరలో రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందించబోతున్నారు. ఈక్రమంలో పవన్ – సుజీత్ కాంబోలోని ‘ఓజీ’కి హీరోయిన్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది.అందం, నటనలో ప్రేక్షకులను మెప్పించిన ప్రియాంక మోహన్ Original Gangstarలో పవన్ సరసన నటించే ఛాన్స్ దక్కించుకుందని తెలుస్తోంది.

797 views