సినిమా రిజల్ట్ తో పని లేకుండా వరుసగా సినిమా లు చేస్తున్న వారిలో ఒకరు సంతోష్ శోభన్
గోల్కొండ హైస్కూల్ లో బాల నటుడు గా చేసిన ఈయన తను నేను సినిమా తో మొదట హీరో గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే అయితే ఆ తర్వాత పేపర్ బాయ్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు,ఇక వరుస సినిమా లు చేస్తున్నప్పటికీ సరైన హిట్ లేని సమయం లో తన మార్క్ కామెడి కథ తో అభిషేక్ మహర్షి డైరెక్టర్ గా ప్రేమ్ కుమార్ అనే సినిమా తో ఆగష్టు 18 న మన ముందుకు వచ్చారు.ఈ సినిమా తో అయినా సంతోష్ శోభన్ కి హిట్ వచ్చిందా లేదా ?
కథ: ప్రేమ్ కుమార్ (సంతోష్ శోభన్ ) తన లైఫ్ లో పెళ్లి అనేది చాల ఇంపార్టెంట్ అని ఫీల్ అవుతుంటాడు కానీ తనకి మాత్రం ఈ ఒక్క పెళ్లి కూడా సెట్ కాదు ,దానికి తోడు తాను లవ్ చేసిన అమ్మాయి తో కూడా పెళ్లి వర్క్ అవుట్ కాదు ,అయితే మొదట నుంచి పెళ్లి లు కాన్సల్ కావడం తో విసుగు చెందిన ప్రేమ్ కుమార్ ఒక బిజినెస్ ని స్టార్ట్ చేస్తారు,తన తో పాటు ఉన్న స్నేహితుల తో కలిసి స్టార్ట్ చేసిన బిజినెస్ కి తన పెళ్లి లు కాన్సల్ అవడం కి కారణాలు ఏంటి
అసలు ప్రేమ్ కుమార్ కి పెళ్లి అవుతుందా ? లేదా అనేది మిగిలిన కథ.
విశ్లేషణ:సంతోష్ శోభన్ ఇప్పటి వరకు చేసిన సినిమా లు అన్ని ఒక పక్కన ఉంటె ఈ సినిమా మాత్రం వాటికి డబల్ గా ఉంటుంది.మొదటి సీన్ నుంచి చివరి సీన్ వరకు ప్రతి సీన్ ని కూడా కామెడీ తో నింపేశారు.సంతోష్ శోభన్ కి పోటీగా సుదర్శన్ , ఇటీవల యూట్యూబ్ లో ఫేమస్ అయినా కమెడియన్ ల తో సినిమా ని ఫుల్ లెంగ్త్ కామెడీ తో ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా డైరెక్టర్ జాగ్రత్త పడ్డారు అనే చెప్పాలి.మన తెలుగు సినిమా ల లో రొటీన్ గా ఉండే క్లైమాక్స్ ని పక్కన పెట్టి విచిత్రమైన ఎండింగ్ తో ముగించారు.అభిషేక్ మహర్షి ఇది వరకు పని చేసిన భలే మంచి రోజు , ది బేకర్ అండ్ బ్యూటీ ల లో తన రైటింగ్ తో అలరించిన ప్రేమ్ కుమార్ సినిమా తో తన లో ని డైరెక్టర్ ని బయట తీసుకుని వచ్చి సంతోష్ శోభన్ కి బ్లాక్ బస్టర్ ఇచ్చారు అనే చెప్పాలి.
పాజిటివ్:కథ ,స్క్రీన్ ప్లే ,కామెడీ ,సంతోష్ శోభన్ ,క్లైమాక్స్.
నెగటివ్:ప్రిడిక్టబుల్ స్టోరీ.
రేటింగ్ :3 .75 / 5