Prasanth neel: రాజమౌళి ని మించిపోయిన ప్రశాంత్ నీల్ రెమ్యూనిరేషన్ !

Posted by venditeravaartha, May 22, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

ఇండియా లో ఉన్న సినీ ఇండస్ట్రీ ల లో అతి చిన్నది శాండిలీవూడ్..అక్కడ ఒక పెద్ద సినిమా బడ్జెట్ మన టాలీవుడ్ టైర్-2 హీరో ల రెమ్యూనిరేషన్ తో సమానం గా ఉంటుంది.అయితే ఒక కన్నడ సినిమా మన ఇండియన్ సినిమా ని శాసించే స్థాయి కి వస్తుంది అని ఎవరు కూడా ఊహియించి ఉండరు.ఆ ఊహ ని నిజం చేసాడు ఒక డైరెక్టర్ ఆయనే ‘ప్రశాంత్ నీల్’.2014 లో తన మొదటి సినిమా ‘ఉగ్రం’ తో బ్లాక్ బస్టర్ సాధించిన ప్రశాంత్ నీల్..మొదటి సినిమా బడ్జెట్ 4 కోట్ల కి 20 టైమ్స్ పెంచి తన రెండవ సినిమా ‘కెజిఫ్’ ని తీశారు.మొదటి భాగం సూపర్ హిట్ కావడం తో 100 కోట్ల బడ్జెట్ తో కెజిఫ్ చాప్టర్ 2 ని తీసి 1200 కోట్ల పైన కలెక్షన్స్ రాబట్టారు.

Yash and prasanth neel at kgf

ఇండియన్ సినీ చరిత్ర లో 1000 కోట్లు వసూళ్లు సాధించిన సినిమా ల లో కెజిఫ్ చాప్టర్ 2 మూవీ ఉంది అంటే ప్రశాంత్ నీల్ గారి స్టామినా ఏంటో తెలుస్తుంది.కెజిఫ్ సిరీస్ సక్సెస్ కావడం తో ఇప్పుడు ప్రశాంత్ నీల్ యొక్క మార్కెట్ పెరిగింది మొదట సినిమా కి 50 లక్షల రెమ్యూనిరేషన్ తీసుకున్న తను ఇప్పుడు ప్రభాస్ తో చేస్తున్న సాలార్ మూవీ కోసం 50 కోట్ల రెమ్యూనిరేషన్ తీసుకోబోతున్నారట.సాలార్ మూవీ ని రెండు భాగాలుగా నిర్మిస్తున్నారు.

Yash and prasanth neel at kgf

ఇక జూనియర్ ఎన్టీఆర్ తో రాబోతున్న సినిమా కోసం ప్రశాంత్ నీల్ కళ్ళు చెదిరే రెమ్యూనిరేషన్ అందుకోనున్నారు..మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ని 300 కోట్ల భారీ బడ్జెట్ తో తీస్తున్నారు.ఇందుకు ప్రశాంత్ నీల్ కి దాదాపు 60 కోట్ల రెమ్యూనిరేషన్ తో పాటు కన్నడ లో షేర్ కూడా ఇవ్వనున్నారు.ఇక సాలార్ ,ఎన్టీఆర్ సినిమా ల తో పాటు గా యాష్ తో కెజిఫ్ 3 కూడా త్వరలోనే ఉండబోతుంది.మన సౌత్ ఇండస్ట్రీ లో రాజమౌళి గారితో సమానం గా అంత రెమ్యూనిరేషన్ తీసుకుంటున్న ఏకైక డైరెక్టర్ ‘ప్రశాంత్ నీల్’.

Yash and prasanth neel at kgf

553 views