జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట మండలం జగ్గంపేట గ్రామంలో ప్రజాసంకల్ప పాదయాత్ర కి నేటితో ఐదేళ్లు పూర్తియైన సంధర్భంగా వై.యస్. ఆర్. కాంగ్రెస్ పార్టీ జగ్గంపేట నియోజకవర్గo ఇంఛార్జి మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వర్యులు మరియు కాకినాడ మాజీ పార్లమెంటు సభ్యులు శ్రీ తోట నరసింహంస్వర్గీయ వై.యస్.రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి పూలమాల వేసి కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు, మరియు అభిమానులు పాల్గొన్నారు.
పల్లెపల్లెనూ చైతన్య పరుస్తూ 3,648 కి.మీ సాగించిన ప్రజా సంకల్ప పాదయత్రకి నేటితో ఐదేళ్లు పూర్తయ్యాయి. ముఖ్యమంత్రిగా వై.యస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తరువాత ప్రజాక్షేత్రంలో ఇచ్చిన ప్రతీ మాటను నిలబెట్టుకుంటూ జనం మనసులు గెలుచుకున్నారని అన్నారు. ప్రజలకి మంచి చేయాలనే సంకల్పం తో పని చేస్తున్న గొప్ప నాయకుడు జగన్ గారు అని చెప్పారు. సంక్షేమ పథకాలతో సామాన్య ప్రజలకు అండగా నిలిచిననాయకుడు వైఎస్ జగన్ఆయన విజయంలోనే.. సామాన్యుడి విజయం ఉంది అని ఆంధ్రాకు మళ్లీ సంక్షేమం కావాలి,2024లో జగనన్న మళ్లీ రావాలి అని అన్నారు.