Pragathi: ఈ బడా నిర్మాతతో రెండో పెళ్లికి రెడీ అయిన ప్రగతి ఆంటీ.. ఫస్ట్ ప్రపోజ్ చేసింది ఆయనేనట

Posted by venditeravaartha, October 29, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

ఈరోజుల్లో పెళ్లిళ్లు ఎంత వైభవంగా జరుగుతున్నాయో.. అంతే తొందరగా విడిపోతున్నారు. పూర్వం ఒక జంట విడిపోవాలంటే, సరైన కారణాలను ఎన్నింటినో చెప్పాల్సి వచ్చేది. అప్పుడు కూడా వాటిని పెద్దవాళ్ళు ఎవ్వరూ సరిదిద్దలేకపోతే.. తప్ప ఇక వేరే దారి లేక విడిపోనిచ్చేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. పెళ్లయ్యాక ఇద్దరి మధ్య గొడవలు వస్తే వెంటనే విడిపోతున్నారు. దానికి పెద్ద కారణం కూడా అవసరం లేదు. ఈజీగా మాకు మైండ్ సెట్ కలవడం లేదు అంటున్నారు. విడిపోయే కల్చర్ ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగిపోయింది. విడిపోయిన జంటల్లో మగవారు త్వరగా రెండో పెళ్లి చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారుతుంది.. మగవారు మాత్రమే కాదు, ఆడవారు కూడా ఇప్పుడు రెండో పెళ్లి చేసుకుంటూనే ఉన్నారు.

రెండో పెళ్లిళ్ల ట్రెండ్ కూడా పెరిగిపోయి ప్రస్తుతం పిల్లలు పెద్దయ్యాక కూడా రెండో పెళ్లికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు మహిళలు. ఇటీవల గాయని సునీత ( Sunitha ) కూడా రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత చాలా మంది సెలబ్రిటీలు ఆమెను ఆదర్శంగా తీసుకుని జీవితంలో ముందుకు సాగాలని రెండో పెళ్లిళ్లకు ముందడుగు వేస్తున్నారు. అలాగే తాజాగా సింగర్ కౌసల్య రెండో పెళ్లి చేసుకోనుంది. టాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పేరు తెచ్చుకున్న ప్రగతి( Pragathi ) రెండో పెళ్లి చేసుకోబోతుందంటూ సోషల్ మీడియాలో అనేక వార్తలు వస్తున్నాయి. ప్రగతికి పెళ్లై ఇద్దరు పిల్లలు పుట్టాక భర్తతో విడాకులు తీసుకుంది. ప్రస్తుతం ప్రగతి వయసు 47 ఏళ్లు. తాను 21 ఏళ్ల వయసులోనే తన భర్తతో విడిపోయింది. అప్పటి నుంచి మరో పెళ్లి చేసుకోకుండా పిల్లల కోసం సింగిల్‌ మదర్‌గానే జీవిస్తోంది.

ఆ తర్వాత తన ఇద్దరి పిల్లల భవిష్యత్తు తీర్చి దిద్దడానికి అనేక కష్టాలు పడింది. తాను ఎంతో కష్టపడి పిల్లలని ఒక స్థాయికి తీసుకుని వచ్చింది. ప్రగతికి ఒక కొడుకు, కూతురు. వాళ్లిద్దరి జీవితం సెటిల్ చేయడమే తన జీవిత లక్ష్యంగా పెట్టుకుని కష్టించింది. అయితే తన మనస్తత్వానికి సరిపోయే వ్యక్తి దొరికితే, ప్రగతి మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకుంటోంది. ఇది కూడా తన పిల్లల నిర్ణయానికే వదిలేసి వాళ్లు ఒప్పుకుంటే ప్రగతి కూడా సమ్మతమే అంటుంది. తన మెంటాలిటీకి సరిపడే అతను దొరికితే ప్రగతి పెళ్లి చేసుకోవాలని అనుకుంటుందట. ఈ వార్త గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో షికారు చేస్తుంది. ప్రగతి ప్రస్తుతం ఓ బడా ప్రొడ్యూసర్ ను పెళ్లాడబోతున్నట్లు తెలుస్తోంది. ఆమె అతనిని వివాహం చేసుకోవడానికి రెడీ ఉన్నట్లు సమాచారం. ఆయన ఎవరు, వారి పెళ్లి ఎప్పుడు జరుగబోతుంది అనేది తెలియాల్సి ఉంది. కాగా ఆ నిర్మాత ప్రగతిపై ఇష్టంతో మొదట ఆయనే పెళ్లి ప్రపోజల్‌ తెచ్చినట్లు తెలుస్తోంది.

Tags :
775 views