Prabhas:ప్రభాస్ ‘గే’ గా నటించమని చెప్పిన డైరెక్టర్..?తప్పక చేశానన్న ప్రభాస్..

Posted by uma, April 10, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

Prabhas: పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్. మొదటి సినిమా ఈశ్వర్ తో కృష్ణంరాజు వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ తనకంటూ తెలుగు ఇండస్ట్రీలో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ప్రభాస్ వర్షం సినిమా రొమాంటిక్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న, తర్వాత వచ్చిన మున్నా,యోగి, చత్రపతి సినిమాలతో తనకంటూ మాస్ ఇమేజింగ్ సొంతం చేసుకున్న హీరో ప్రభాస్. తర్వాత వచ్చిన బిల్లా ,డార్లింగ్ ,మిర్చి, సినిమాలతో తన ప్లేస్ ని ఎవరు రీప్లేస్ చేయనంత ఎత్తుకు ఎదిగిపోయారు.

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి మూవీతో ఇక పాన్ ఇండియా స్టార్ లెవెల్ కి ఎదిగిపోయారు ప్రభాస్ ఆ తర్వాత వచ్చిన ఆది పురుష్ మూవీ రీసెంట్ గా వచ్చిన సలార్ మూవీతో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నారు. ప్రజెంట్ కల్కి 2898, స్పిరిట్, రాజ సాబ్ వంటి సినిమాలతో బిజీగా గడుపుతున్నరు. ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ లెవెల్ సినిమాలు చేస్తున్నాడు కానీ ఒక్కొక్క మూవీలో తనకి నచ్చని సన్నివేశాల్లో కూడా నటించాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు . ప్రభాస్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో, ఒకానొక మూవీలో ప్రభాస్ ‘గె’ లాగా చేయాల్సి వచ్చింది అని చెప్పుకొచ్చాడు ఇప్పుడు దాని గురించి చూద్దాం..

ప్రభాస్ స్వతహాగానే కాస్త రిజర్వుడిగా ఉంటారు అని టాక్.. సినిమా సెలక్షన్స్ ల విషయం లోను,ఎవ్వరి సలహాలు తీసుకోరని టాక్.. ఇదిలా ఉంటే అసలు ప్రభాస్ గేగా నటించిన చిత్రం ఏంటని ఇప్పటివరకు ఎవరు ఆలోచించి ఉండరు. ఆ సినిమానే చక్రం. కృష్ణవంశీ దర్శకత్వంలో ఎమోషనల్ కంటెంట్ వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఆడియన్స్ ని పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇందులో ప్రభాస్ చాలా డిఫరెంట్ గా కనిపించడమే కాకుండా ఒకానొక సీన్లో గేగా నటించాల్సి వచ్చిందిట. ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ ను మీ కెరియర్ లోనే మీరు కష్టంగా అనిపించిన సీన్ ఏదైనా చేశారా అని అడిగితే అందుకు ప్రభాస్ బదులిస్తూ ..

చక్రం చిత్రంలో ఒక సీన్లో గెల నటించాల్సి వచ్చిందని అది నాకు ఎప్పటికీ నచ్చని సన్నివేశమైన డైరెక్టర్ కోసం నేను చెయ్యక తప్పలేదని క్యారెక్టర్ కి అవసరం కాబట్టే డైరెక్టర్ గారు నన్ను చేయమన్నారు అనుకోని నేను చేశాను అని కానీ నాకు ఆ సీన్ చాలా ఇబ్బంది పెట్టిందని నాకు ఏమాత్రం ఇష్టం లేదని, అయినా అప్పట్లో చేశానని ప్రభాస్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ వార్త నెట్ హల్చల్ చేస్తుంది ప్రభాస్ చెప్పిన ఈ వార్త ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. చక్రం మూవీలో ప్రభాస్ తో పాటు హీరోయిన్ గా అసిన్, చార్మి నటించారు.

691 views