PRABHAS-KRITI SANAN:కలియుగ శ్రీ రాముడు మన ప్రభాస్ ! ప్రభాస్ ని పొగడలతో ముంచెత్తిన కృతిసనన్ !

Posted by venditeravaartha, May 11, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

టాలీవుడ్ లో ప్రభాస్ కి గురించి ఎవరిని అడిగిన అయన మంచితనం గురించి చాల గొప్ప గా చెప్తారు,కృష్ణం రాజు నటవారసుడు గా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన ప్రభాస్ వర్షం సినిమా తో తన కంటూ ప్రత్యేకమైన స్టైల్ ఏర్పరుచుకున్నారు.ఇక 2005 లో రిలీజ్ అయినా ఛత్రపతి సినిమా తో టాప్ స్టార్ గా మారిపోయాడు ,డార్లింగ్ ,మిస్టర్ పర్ఫెక్ట్,మిర్చి సినిమా ల తో బ్లాక్ బస్టర్ ల తో ఉన్న రాజమౌళి గారి బాహుబలి సిరీస్ తో యావత్ భారత దేశం అంతటా ప్రభాస్ పేరు మారుమోగింది.ఇక వరుస గా పాన్ ఇండియన్ సినిమా ల తో బిజీ గా ఉన్న ప్రభాస్ జూన్ 16 నా రాబోతున్న ‘ఆదిపురుష్’ సినిమా ప్రమోషన్ ల లో భాగం గా మే 9 నా ఆదిపురుష్ ట్రైలర్ ని రిలీజ్ చేసారు.ఈ కార్యక్రం లో ప్రభాస్ తో పాటు హీరోయిన్ ‘కృతి సనన్’ కూడా పాల్గొన్నారు.

ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్ అయినా తర్వాత ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశం లో హీరోయిన్ కృతి సనన్ మాట్లాడుతూ .. ప్రభాస్ గురించి అందరికి తెలిసిందే నేను కొత్తగా చెప్పేది ఏమి లేదు కానీ ఆ రాముడు ఎంత మంచివాడో అలానే అంత మంచి వాడు మన ప్రభాస్.అయన తో పని చేయడం నా అదృష్టం గా భావిస్తున్నాను.ఈ సినిమా తో మరో సారి ఇండియన్ బాక్స్ఆఫీస్ ని బద్దలు కొట్టబోతున్నాము అన్నారు.అయితే ఆదిపురుష్ సినిమా షూటింగ్ ల లో ప్రభాస్ ,కృతి సనన్ లు స్నేహం గా ఉండేవారు అని ఆ స్నేహం కాస్త ప్రేమ గా మారి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అని అప్పట్లో వార్తలు వచ్చాయి.వీటిని ప్రభాస్ పలు సందర్భాల లో ఖండించిన బాలయ్య తో జరిగిన షో లో కృతి సనన్ తో కేవలం స్నేహం తప్ప మరి ఏమి లేదు అని స్పష్టం చేసాడు.కానీ మొన్న కృతి సనన్ ప్రభాస్ మీద చేసిన వ్యాఖ్యలు దృష్ట్యా వీరి మధ్య ఉన్న సంబంధం గురించి చర్చలు జరుగుతున్నాయి.

1807 views