POOJA HEGDE:ఐరన్ లెగ్ గా మారిన పూజ హెగ్డే ,ఇక గురూజీ మాత్రమే కాపాడాలి ఆమెని !

Posted by venditeravaartha, April 24, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

2014 లో రిలీజ్ అయినా ముకుంద సినిమా తో తెలుగు సినీ పరిశ్రమ కి పరిచయం అయినా బ్యూటీ ‘పూజ హెగ్డే ‘,మొదట్లో ఈమె నటించిన సినిమా లు చాల వరకు బ్లాక్ బస్టర్ హిట్లు సాధించాయి,2020 లో రిలీజ్ అయినా అల్లు అర్జున్ ‘అలా వైకుంఠ పురము లో ‘ సినిమా తో ఆల్ టైం బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన పూజ హెగ్డే ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాలు చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకోలేకపోయాయి. వీటిలో ముందుగా ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా గురించి చెప్పుకోవాలి. భారీ అంచనాల తో రిలీజ్ అయినా ఈ సినిమా డిసాస్టర్ అయింది ,తర్వాత విజయ్ తో ‘బీస్ట్ ‘ కూడా ప్లాప్ టాక్ వచ్చింది.

కొరటాల శివ డైరెక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య సినిమాలోకూడా పూజా హెగ్డే నటించింది. ఈ సినిమా ఎంత డిజాస్టర్ అయ్యింది అందరికి తెలుసు. ఈ సినిమా మెగా ఫ్యాన్స్ ను చాలా నిరాశపరిచింది. ఆ తర్వాత బాలీవుడ్ లో సర్కస్ అనే సినిమా చేసింది రణవీర్ కపూర్ హీరోగా నటించిన ఈ మూవీ దారుణంగా ఫ్లాప్ అయ్యింది.

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కిసీ కి భాయ్.. కిసీ కి జాన్ అనే సినిమా లో నటించింది. ఈ సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది. భారీ అంచనాలు పెట్టుకున్న ఈ సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో నటిస్తోంది పూజ హెగ్డే. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇది వరకు అరవింద సమేత,అలా వైకుంఠ పురము లో గురూజీ పూజ హెగ్డే కి సూపర్ హిట్లు ఇచ్చారు ,ఇప్పుడు మహేష్ బాబు సినిమా తో మరల పూజ కి హిట్ అందుతుందో లేదో చూడాలి.

702 views