Dimple Hayathi : రవితేజ హీరోయిన్ పై క్రిమినల్ కేసులు..

Posted by venditeravaartha, May 23, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

Dimple Hayathi : రవితేజ హీరోగా నటించిన ఖిలాడి మూవీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన డింపుల్ హయాతి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఏమాత్రం ఆలోచించకుండా మాస్ మహారాజకు లిప్ కిస్ కు వెనుకాడలేదు. దీంతో డింపుల్ ఫుల్ ఫేమస్ అయింది. అప్పటి నుంచి డింపుల్ గురించి ఏ చిన్న మ్యాటర్ అయినా ఇట్టే వైరల్ అవుతోంది. లేటేస్టుగా డింపుల్ పై ఏకంగా క్రిమినల్ కేసు నమోదైంది. ట్రాఫిక్ పోలీసుతో ఆమె ప్రవర్త సరిగా లేనందున ఆమెపై పలు సెక్సన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. హీరోయిన్ డింపుల్ హయాతి ప్రస్తుతం హైదరాబాదులోని జర్నలిస్ట్ కాలనీలో ఉన్న ఓ అపార్ట్మెంట్లో ఉంటున్నారు.

police-case-registered-against-raviteja-heroine

ఇదే అపార్ట్మెంట్లో ట్రాఫిక్ విభాగంలో డిసిపి గా పనిచేస్తున్న రాహుల్ హెగ్డే నివసిస్తున్నారు. కార్ పార్కింగ్ విషయంలో రాహుల్ హెగ్డేకు, డింపుల్ కు మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. ఓసారి డింపుల్, ఆమె స్నేహితుడు డేవిడ్ ల మధ్య పెద్ద గొడవే జరిగింది. వీటిని మనసులో ఉంచుకున్న డింపుల్ మరో రోజు కారు పార్కింగ్ విషయంలో ఫైర్ అయింది. అయితే ఈ సమయంలో రాహుల్ డ్రైవర్ కారులో ఉన్నారు. డింపుల్ ఎప్పటిలాగే రాహుల్ కారును తన్నారు. అంతేకాకుండా తనపై దురుసుగా ప్రవర్తించారని ఆయన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రాథమికంగా విచారించిన పోలీసులు డింపుల్ పై 353, 341, 279 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

DCP Rahul Hegde reacted on Dimple Hayathi's tweet

ఇవన్నీ క్రిమినల్ సెక్సన్లకు సంబంధించినవి కావడంతో ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ గొడవపై డింపుల్ హయాతి స్పందించారు ‘అధికారం ఉపయోగించి తప్పును కప్పించలేరు’.. ‘సత్యమేవ జయతే’.. అంటూ ట్వీట్ చేశారు. 2017లో ‘గల్ఫ్’ సినిమాతో ఫిల్మ్ ఎంట్రీ ఇచ్చిన డింపుల్ ఆ తరువాత 2019లో యురేక అనే సినిమాలో నటించింది. అయితే వరున్ తేజ్ హీరోగా వచ్చిన ‘గద్దలకొండ గణేశ్’ మూవీలోని జర్ర జర్ర అనే సాంగ్ లో డింపుల్ చేసిన డ్యాన్స్ కు ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఆ తరువాత రవితేజతో కలిసి ఖిలాడి సినిమాలో హీరోయిన్ గా చాన్స్ కొట్టేసింది. లేటేస్టుగా గోపీచంద్ హీరోగా వచ్చిన ‘రామబాణం’ సినిమాలోనూ డింపుల్ కనిపించింది.

1782 views