PK-SDT: పవన్ ,సాయి ధరమ్ తేజ్ ల మూవీ టైటిల్ వచ్చేసింది ! ఆ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే కేక !

Posted by venditeravaartha, May 18, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan) ,సాయి ధరమ్ తేజ్(Sai dharam tej) కలయిక లో తమిళ సూపర్ హిట్ మూవీ ‘వినోదయ సీతాం’ రీమేక్ వస్తుంది అన్న విషయం తెలిసిందే.ఈ చిత్రానికి సముద్రఖని(Samudra khani) డైరెక్షన్ చేయగా త్రివిక్రమ్(Trivikram) మాటలు ,స్క్రీన్ ప్లై ఇవ్వనున్నారు.థమన్ మ్యూజిక్ అందించారు.ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ ,పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ ని మే 18 గురువారం రోజున రిలీజ్ చేసారు. ఈ సినిమా కి ‘బ్రో'(BRO) అని టైటిల్ ని ఫిక్స్ చేసారు.

పవన్ కళ్యాణ్ వరుసగా చేస్తున్న సినిమా ల లో మొదటగా తన పోర్షన్ పూర్తి చేసిన మొదటి సినిమా బ్రో,జులై 28 న రిలీజ్ కానున్న ఈ సినిమా మీద భారీ అంచాలనే ఉన్నాయి.మెగా ఫ్యామిలీ నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,సాయి తేజ్ కలిసి నటిస్తుండటం త్రివిక్రమ్ మాటలు,స్క్రీన్ ప్లే అందిస్తుంటాం హ్యూజ్ ఎక్సపెక్టషన్స్ పెంచుతున్నాయి.ఇక ఈ రోజు రిలీజ్ చేసిన టైటిల్ మోషన్ వీడియో లో పవన్ కళ్యాణ్ స్టైల్ చాలా బాగుంది ,తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ గా నిలిచింది.పవన్ స్లిమ్ లుక్ ని చూసిన అభిమానాలు అందరు వింటేజ్ పవన్ బ్యాక్ అంటున్నారు.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ,జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా జులై 28 న ప్రపంచ వ్యాప్తముగా రిలీజ్ కానుంది.

1516 views