పెందుర్తి వెంకటేష్ పార్టీ శ్రేణులతో ఆత్మీయ సమావేశం…బొడ్డు విజయమే లక్ష్యం

Posted by venditeravaartha, July 22, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

తూర్పుగోదావరిజిల్లా, రాజనగరం నియోజవర్గం కోరుకొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ పార్టీ శ్రేణులతో ఆత్మీయ సమావేశం అయ్యారు నియోజకవర్గ ఇన్చార్జ్ మార్పు తర్వాత సమావేశం నిర్వహణ పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు హాజరు అయ్యారు. రాజానగరం నియోజకవర్గ ఇన్చార్జిగా బొడ్డు వెంకటరమణ చౌదరి విజయమే లక్ష్యంగా కృషి చేద్దాం అని మాజీ ఎమ్మెల్యే పెందుర్తి పిలుపునిచ్చారు.

 

ఇటీవల రాజకీయ పరిణామాలు చాలా స్పీడ్ గా ఊపు అందుకున్నాయి అని చెప్పాలి రానున్న ఎన్నికల్లో విజయమే దిశగా అధికార పక్షం అలాగే ప్రతి పక్షం కూడా పాములు కదుపుతున్నాయి. ఇక రాజమండ్రి పార్లమెంట్ లో కీలక నియోజకవర్గం పైన తెలుగుదేశం పార్టీ ఫోకస్ పెట్టింది అని చెప్పాలి అంతే కాదు వైసీపీ పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గం లో కీలక నేతకు ఇంచార్జ్ ఇవ్వడం తో పరిణామాలు మారనున్నాయి. 2009 లో పార్లమెంట్ కు వైసీపీ తరుపున పోటీ చేసిన బొడ్డు వెంకట రమణ కు ఇంచార్జ్ ఇచ్చి జక్కంపూడి కి చెక్ పెట్టాలని చంద్రబాబు భావించారని సమాచారం అంతే కాదు రాజానగరం లో టీడీపీ ని పూర్తి స్థాయిలో బొడ్డు వెంకట రమణ చౌదరి బలోపేతం చేస్తారని అధినాయకుడు ధీమా గా ఉన్నారని సమాచారం.

Tags :
1829 views