పోలీసుల అదుపులో 9 మంది పెద్దాపురం వాసులు

Posted by venditeravaartha, September 17, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

పెద్దాపురం పట్టణంలోని రామారావు పేటలో పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో 9 మందిని అదుపులోకి తీసుకున్నామని పెద్దాపురం సీఐ క్రాంతికుమార్ తెలిపారు. పేకాట ఆడుతున్న వారి వద్ద నుంచి రూ.2.44 లక్షలు నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Tags :
298 views