Pawan Prabhas: ప్రాణాలను తీసుకునేలా హద్దులు దాటిన అభిమానం

Posted by venditeravaartha, April 26, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

సాధారణం గా టాలీవుడ్ హీరోలకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా కనిపిస్తుంది తమ సొంత ఫ్యామిలీ మెంబర్స్ కంటే సినిమా హీరో లే ఎక్కువ అన్నట్లు మారిపోతున్నారు తెలుగు ప్రేక్షకులు తమ హీరో గొప్ప అంటే తమ హీరో గొప్ప అని వారి గొప్పల కోసం అభిమానులు గొడవలు పడి కొట్లాటలు చేస్తున్నారు ఇందులో భాగం గానే పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి లో హరికుమార్ మరియు కిషోర్ అనే ఇద్దరు వ్యక్తులు గొడవపడి ప్రాణాలు తీసుకోవడం జరిగింది. అయితే వీరిద్దరూ నజీర్ అనే వ్యక్తి ఇంటికి పెయింట్ వేయడానికి వెళ్లారు అక్కడ వీరిద్దరి సంభాషణ లో భాగం గా హరి కుమార్ అనే వ్యక్తి ప్రభాస్ గొప్ప హీరో అని తాను ప్రభాస్ కి పెద్ద ఫ్యాన్ అని పొగుడుతూ తన వాట్సాప్ లో ప్రభాస్ స్టేటస్ పెట్టుకున్నాడు అది చూసిన కిషోర్ తాను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటూ ప్రభాస్ గురించి తక్కువగా చేసి మాట్లాడి ఆ స్టేటస్ ను తొలగించి పవన్ కళ్యాణ్ స్టేటస్ పెట్టమని బలవంతం చేశాడు దానితో వీరిద్దరి మధ్య గొడవ మొదలైంది.

కిషోర్ ప్రభాస్ ను తక్కువ చేసి మాట్లాడడం భరించలేని హరికుమార్ తన కోపాన్ని దిగమింగలేక అక్కడే ఉన్న సెంట్రింగ్ కర్రతో కిషోర్ ని కొట్టడమే కాకుండా పక్కనే ఉన్న సిమెంట్ రాయిని పట్టుకొని తల మీద కొట్టడంతో కిషోర్ అక్కడికక్కడే మృతి చెందాడు అతను చనిపోవడం చూసి భయంతో హరికుమార్ పారిపోయాడు కేసు నమోదు చేసిన పోలీసులు పరారీ లో ఉన్న హరికుమార్ కోసం వెతుకుతున్నారు అయితే హీరో మీద అభిమానం అనేది సినిమా చూసేంత వరకే ఉండాలని అది ఇద్దరూ స్నేహితులను గొడవ పడి ప్రాణాలు తీసుకునే వరకు వెళ్లకూడదు అనే కామెంట్స్ చేస్తున్నారు మరికొందరు. హీరోలు అందరూ కలిసి ఒక ఫ్యామిలీ ,ఫ్రెండ్స్ గానే ఉంటున్నారు వారికి లేని విభేదాలు మనకు ఎందుకు మిత్రమా సినిమాల నుండి ఏదో ఒక మెసేజ్ ను గ్రహించాలి కానీ ఈ విధంగా విభేదాలు చూపించకూడదని సినిమాలను కేవలం ఒక సినిమాగానే చూడాలని నా యొక్క చిన్న సలహా.

531 views