Renudesai: రేణు దేశాయ్ కి పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువ ఆస్తులు ఉన్నాయా..? ఆమె నెల సంపాదన ఎంతో తెలిస్తే నోరెళ్లబెడుతారు!

Posted by RR writings, October 19, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]


Renudesai: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan) మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బద్రి సినిమా సమయంలో ఒకరినొకరు ప్రేమించుకుని, పెళ్లి చేసుకుని కొన్నాళ్లు సంతోషంగా జీవించిన ఈ జంట, ఆ తర్వాత కొన్ని గొడవల కారణంగా విడాకులు తీసుకున్నారు. తర్వాత ఎవరి జీవితాలు వారు విడివిడిగా గడిపేస్తున్నారు. రేణుదేశాయ్ తన పిల్లలతో కలిసి పూణెలో నివసిస్తోంది. పవన్ కళ్యాణ్ నుండి విడాకులు తీసుకున్న ఆమె దర్శకురాలిగా, నిర్మాతగా, పలు కార్యక్రమాలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తోంది. పవన్ మాత్రం వరుస సినిమాలు, రాజకీయాలతో బిజీగా ఉన్నారు.

ఇన్నాళ్లపాటు వెండితెరకు దూరమైన రేణు.. ప్రస్తుతం రవితేజ హీరోగా తెరకెక్కిన ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాతో రీఎంట్రీ ఇవ్వ బోతుంది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగాంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ.. తన జీవితానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకుంటున్నారు. ఇన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న రేణుకి సంపాదన ఎలా వస్తుంది. ఆమెకు సినిమాలే కాకుండా ఇంకేమైనా బిజినెస్ లు చేస్తుందా అన్న విషయాన్ని తెలియజేసింది. వృత్తే కాకుండా ఇంకేమి వ్యాపారం చేస్తుంది అనే విషయాలను తెలియజేసింది. పవన్ కళ్యాణ్ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత రేణుదేశాయ్ భారీ మొత్తంలో మెయింటెనెన్స్ తీసుకున్నట్లు గతంలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అయితే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రేణుదేశాయ్.. తనపై వస్తున్న ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, తాను పవన్ కళ్యాణ్ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదన్న వాస్తవాన్ని వెల్లడించింది. తన పిల్లలకు తండ్రిగా ఉండాల్సిన బాధ్యతలను పవన్ కల్యాణ్ నిర్వర్తిస్తున్నారని రేణుదేశాయ్ అన్నారు.

అయితే రేణూదేశాయ్ కి రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉందట. అదే ఆమెకు ప్రధాన ఆదాయ వనరట. ఇది తన ఫ్యామిలీ నుంచి వచ్చిందట. ఫ్యామిలీలో నాయనమ్మ, నాన్న అదే వృత్తి చేసేవారట. రేణూదేశాయ్ కి కూడా అదే వచ్చిందట. ప్రస్తుతం రేణు హైదరాబాద్, పూణేలో ఈ బిజినెస్ చేస్తుంది. ఈ క్రమంలోనే ఈ రెండు చోట్ల ఆమె బాగానే ఆస్తులు సంపాదించిందట. అలా వచ్చిన సంపాదనతోనే అటు పిల్లలని, అప్పుడప్పుడు సినిమా నిర్మాణంలో కూడా ఇన్వెస్ట్ చేస్తూ వస్తుంది. టైగర్ నాగేశ్వరరావు సినిమాలో జాతి వివక్ష, అంటరానితనం వంటి సమస్యలు పై పోరాడిన హేమలత లవణం పాత్రని రేణు పోషిస్తుందట. అక్టోబర్ 20న ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతుంది. ఇక రేణుదేశాయ్ ఆస్తుల విషయానికి వస్తే.. ఆమెకు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో లగ్జరీ ఇల్లు, మూడు కార్లు ఉన్నట్లు సమాచారం. అలాగే, పూణేలో కొన్ని స్థిరాస్తులు ఉన్నాయి. రేణుదేశాయ్ ఆస్తుల విలువ దాదాపు రూ.40 కోట్లని తెలుస్తోంది కాకపోతే దీనిపై అధికారిక ప్రకటన అయితే లేదు.

554 views