బంగారం సినిమాలో పవన్ కళ్యాణ్ తో 2006 లో నటించి మంచి క్రేజ్ సంపాదించినా హీరోయిన్ మీరా చోప్రా అనే చెప్పచు, 2005లో ఎస్.జె. సూర్య తో కలిసి నటించిన అన్బే ఆరుయిరే సినిమాతో మీరా చోప్రా ఇండస్ట్రీ లో అడుగు పెట్టింది. మీరా రెండవ చిత్రం బంగారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి నటించి పాపులర్ అయ్యింది ఆ తరివాత ఎం,ఎస్, రాజు దర్శకత్వం లో వచ్చిన వాన సినిమాతో ప్రసంశలు అందుకుంది. ఇక చాలా కాలం తరువాత విక్రమ్ భట్ 1920 లండన్ శర్మన్ జోషి తో కలిసి బాలీవుడ్ లో కి ఎంటర్ అయ్యింది. వినన్ నిర్మించిన సతీష్ కౌశిక తో కలిసి గ్యాంగ్ అఫ్ గోస్ట్స్ లో నటించింది. ఇక మీరా 2021 లో విడుదలైన అర్జున్ రాంపాల్ తో కలిసి నాస్తిక్ లో నటించింది, ఇక అక్షయ్ ఖన్నా మరియు రిచా చద్దాతో కలిసి 2019 చిత్రం సెక్షన్ 375 లో అంజలి డాంగిల్ గా నటించింది. 2023లో మీరా ‘సూపర్ విమెన్ అనే సినిమాలో నటించింది.
మీరా చోప్రా అన్బే ఆరుయిరే, తమిళ్ సినిమాతో ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇచ్చి తెలుగు, కన్నడ,తమిళ్, హిందీ సినిమాలో నటించింది, తెలుగు లో పవన్ తో కలిసి బంగారం సినిమా తరువాత 2008 లో వినయ్ రాయి తో కలిసి వాన సినిమాలో నటించింది, ఆ సినిమాలో నందిని పాత్ర అందరిని అక్కటుకుంది అనే చెప్పాలి, నితిన్ తో కలిసి మారో సినిమాలో నటించింది ఆ తరువాత నాగార్జున తో కలిసి గ్రీకు వీరుడు అనే సినిమాలో చివరిగా నటించింది, ఆ తరువాత తెలుగు సినిమాలకు దూరం అయ్యింది. ఇక కన్నడ లో అర్జున్, తమిళ్ లో సీన్లను చేసింది, 2017 సంవత్సరం లో వన్ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంటర్ అయింది మీరా చోప్రా ఇలా వరస సినిమాలు చేస్తూ వెబ్ సిరీస్ లో నటిస్తూ మీరా చోప్రా బిజీ గా ఉంటుంది, 2023 లో వచ్చిన హిందీ లో సాఫ్డ్ సినిమాలో నటించింది, ఆమె పెళ్లి గురించి ప్రస్తుతం సోషల్ మీడియా లో పెళ్లి వార్త వైరల్ గా మారింది.
హీరోయిన్ గా మాత్రమే తెలిసిన మీరా చోప్రా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కజిన్ అనే విషయం చాలా మందికి తెలీదు అయితే మీరా చోప్రా 1983 జులై 8న సుధేష్ చోప్రా, నీలం చోప్ర దంపతులకు ఢిల్లీ లో జన్మించింది, మీరా చోప్రా కి సోదరుడు విక్రమ్ చోప్రా ,చెల్లి టీంసి చోప్రా ఉన్నారు. మీరా చోప్రా 2003లో సాగినవ్ వ్యాలీ స్టేట్ యూనివర్సిటీ , మిచిగాన్, యునైటెడ్ స్టేట్స్ నుండి కమ్యూనికేషన్ మరియు మల్టీమీడియా లో మాస్టర్స్ డిగ్రీని పూర్తిచేసింది. మీరా చోప్రా స్టాక్ బ్రోకర్ సుమీత్ భూటాన్ తో రిలేషన్ లో ఉంది, అతను రుచి బట్టన్ ను అప్పటికే వివాహం చేసుకున్నాడు మరియు 5 ఏళ్ళ కొడుకు కూడా ఉన్నాడు. సుమిత్ మీరాను పెళ్లి చేసుకునేందుకు తన భార్యతో విడాకులు ఇవ్వాలని ప్లాన్ చేసాడు, ఇక మీరా తనూజ్ విర్వానీ ఒక భయంకరమైన విరోధిగా నటించిన హాట్ స్టార్ సిరీస్ ‘ ది టాటూ మర్డర్స్ లో ఆమె ఏసీపీ అదితి ఆచార్య పాత్రలో నటించింది.
ముంబై లోని రెడ్ లైట్ ఏరియాలో మరియు చుట్టుపక్కల ఉన్న ఎపిసోడ్స్ సిరీస్ కామాఠిపుర 9 ఏప్రిల్ 2021 న విడుదలైంది. మీరా ‘బి అట్ట్రాక్టీవ్’ మ్యాగజైన్ సెప్టెంబర్ 2021 ఎడిషన్ కవర్ పేజీని అలంకరించాడు. సెప్టెంబర్ 2021 సుకవీందర్ సింగ్ రాసిన ‘ గణపతి రాజా’ పాట కోసం మీరా చోప్రా మ్యూజిక్ వీడియో లో అమ్బరేష్ శ్రోఫ్ఫ్ తో కలిసి నటించింది. కునాల్ కోహ్లీ దర్శకత్వం వహించిన లారా దత్త ,ప్రతీక్ బబ్బర్ మరియు మియాంగ్ చాంగ్ నటించిన లయన్స్ గేట్ ప్లే వెబ్ సిరీస్ హిక్క్యూప్స్ అండ్ హూకుప్స్ లో మీరా చోప్రా లావుగా కనిపించారు. మీరా చోప్రా 2019 సంవత్సరం లో లీగల్ డ్రామా చిత్రం ‘ సెక్షన్ 375 లో అక్షయ్ ఖన్నా, రిచా చెడ్డ మరియు రాహుల్ భట్ తో కలిసి నటించింది, అజయ్ బహల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ గ్రాస్ గా నిలిచింది. ఇక ప్రియాంక చోప్రా మరియు పరిణీతి చోప్రా మీరా కి సినిమాలోకి రావడానికి ఎలాంటి సహాయం చేయలేదు.
ఒక ఇంటర్వ్యూ లో మీరా చోప్రా తెలిపింది, తన ఎవరి సహాయం లేకుండా తన టాలెంట్ తో సినిమాలో అడుగు పెట్టినట్టు మీరా చోప్రా తెలియ చేసింది, బాలీవుడ్ యాక్టర్స్ ప్రియాంక చోప్రా ,పరిణీతి చోప్రా, మన్నారా చోప్రా మీరా చోప్రా కి కజిన్ అవుతారు అనే విషయం చాలామందికి తెలీదు , వాళ్ళు మీరా చోప్రా ని ఇండస్ట్రీ లో రావడానికి ఎలాంటి సహాయం చేయలేదు అని మీరా చోప్రా మీడియా ముందు తెలియ చేసింది, ఈ వార్త కూడా సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఇప్పటికే మీరా చోప్రా 40 ఏళ్ళ వయసులో పెళ్లి చేసుకోబోతుందని బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది, త్వరలో పెళ్లి జరగనునందని ఇప్పటికి పెళ్లి పనులు మొదలయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి అసలు ఈ విషయం ఎంతవరకు నిజం అనేది స్పష్టత లేకుండా ఉంది ఇపుడు ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.