Pawan Kalyan: ఇటీవలే విడుదలైన సార్వత్రిక ఎన్నికల ఫలితాలలో దేశ చరిత్రలోనే ఏ పార్టీ కి లేని విధంగా నూటికి నూరు శాతం సీట్లను గెలిచి ప్రభంజనం సృష్టించిన జనసేన పార్టీ కి సర్వత్రా ఎలాంటి ప్రశంసలు అందుతున్నాయో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. 2019 ఎన్నికలలో జీరో బడ్జెట్ ప్రయత్నం చేసి ఘోర పరాజయాన్ని చవిచూసిన జనసేన పార్టీ, ఇప్పుడు ఈ స్థాయిలో వెనక్కి తిరిగి రావడం ని చూస్తుంటే పవన్ కళ్యాణ్ కష్టం ఎలాంటిదో అందరికి అర్థం అవుతుంది. రాజకీయాల్లోకి రావాలి, జనాలకి ఏదైనా చెయ్యాలి అని ఉత్సాహం చూపే తన తోటి హీరోలకు ఆదర్శంగా నిలిచాడు పవన్ కళ్యాణ్. అయితే గెలిచినా తర్వాత పవన్ కళ్యాణ్ పవర్ షేరింగ్ తీసుకుంటాడా?, లేదా డిప్యూటీ సీఎం అవుతాడా అనే సందేహాలు అభిమానుల్లో ఉండేవి. ఆ సందేహాలకు ఇక తెరపడినట్టే.
పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఈ నెల 12 వ తారీఖున నారా చంద్రబాబు నాయుడు తో కలిసి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని లేటెస్ట్ గా రాజకీయ వర్గాల్లో సాగుతున్న చర్చ. డిప్యూటీ సీఎం తో పాటుగా, హోమ్ మినిస్టర్ గా కూడా ఆయన వ్యవహరిస్తాడని టాక్ వినిపిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా బయటకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతే కాకుండా కేంద్ర క్యాబినెట్ లో కూడా జనసేన పార్టీ ఎంపీ కి స్థానం కలిగే అవకాశాలు ఉన్నాయి. నిన్న ఈరోజు ప్రధాని మోడీ ఇంట్లో ఏర్పాటైన ఎన్డీయే సమావేశం లో పాల్గొన్న పవన్ కళ్యాణ్, జూన్ 9 వ తారీఖున ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు.
అయితే పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రిగా, హోమ్ మినిస్టర్ గా ప్రమాణ స్వీకారం చేస్తే సినిమాలు చేస్తాడా లేదా అనేది ఇప్పుడు అభిమానుల్లో మొదలైన టెన్షన్. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రం తో పాటుగా హరి హర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలు చేస్తున్నాడు. ఈ సినిమాలన్నీ సగం పూర్తి అయ్యాయి. పవన్ కళ్యాణ్ ఇచ్చే తక్కువ డేట్స్ లోనే ఇవి పూర్తి అవుతాయి కూడా. ఎన్నికలు పూర్తి అవ్వగానే సినిమాలు చేస్తాను అని నిర్మాతలకు చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే పరిస్థితి ఏమిటి అని నిర్మాతలు భయపడుతన్నారు. సినిమాలు చేస్తూ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారా?, లేదంటే ఒక్క సంవత్సరం పాటు ఉప ముఖ్యమంత్రి పదవిని హోల్డ్ లో పెట్టి సినిమాలు పూర్తి చేసి వస్తారా అనేది తెలియాల్సి ఉంది.