PAWAN KALYAN:రెండు నెల లో పూర్తి కానున్న పవన్ కళ్యాణ్ భారీ పాన్ ఇండియన్ మూవీ

Posted by venditeravaartha, April 3, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళా పవన్ కళ్యాణ్ గారు తాను ముందుగా కమిట్ అయినా సినిమా లను పూర్తి చేసే పని లో ఉన్నారు,ఇటీవలే సముద్ర ఖని డైరెక్షన్ లో సాయి ధరమ్ తేజ్ తో కలిసి నటిస్తున్న తమిళ రీమేక్ ‘వినోదయ సీతాం’ లో తన పార్ట్ ని పూర్తి చేసుకున్న పవన్ కళ్యాణ్ గారు ,ఇక మిగిన ప్రాజెక్ట్ ల మీద ఫోకస్ చేయనున్నారు.

పవన్ కళ్యాణ్ గారు వరుస గా నటిస్తున్న సినిమా ల లో రెండు పాన్ ఇండియన్ సినిమా లు ఉన్నాయి ,అందులో క్రిష్ డైరెక్షన్ లో వస్తున్న ‘హరిహర వీరమల్లు’,ఇంకోటి యంగ్ డైరెక్టర్ ‘సుజిత్ ‘ దర్శకత్వం లో ‘ఓజి’ .అయితే క్రిష్ మూవీ షూటింగ్ 80 % పైన పూర్తి అయిపోయింది ,గ్రాఫిక్స్ ,పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మాత్రమే ఉంది,ఇక ఈ మధ్య నే పూజ కార్యక్రమాలు చేసుకున్న సుజిత్ సినిమా త్వరలోనే షూటింగ్ స్టార్ట్ కాబోతోంది, డైరెక్టర్ సుజిత్ ఈ సినిమా లొకేషన్స్ వేటలో ఉండగా ఈ సాలిడ్ ప్రాజెక్ట్ పై హైప్ నెక్స్ట్ లెవెల్లో ఉంది.

ఇక ఈ సినిమా షూటింగ్ కూడా అతి త్వరలోనే స్టార్ట్ కానుండగా ఈ సినిమా షూటింగ్ నాన్ స్టాప్ గా అయితే రెండు నెలలు పాటుగా ప్లాన్ చేస్తున్నారట. దీనితో పవర్ స్టార్ పోర్షన్ లు ఆల్ మోస్ట్ ఎక్కువగా కంప్లీట్ చేయనున్నట్టుగా తెలుస్తుంది. మరి మొదటగా అయితే ఉస్తాద్ భగత్ సింగ్ షూట్ ని స్టార్ట్ చేయనుండగా దీని తర్వాత అయితే ఈ సినిమా ‘ఓజి’ స్టార్ట్ కానున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సాలిడ్ ప్రాజెక్ట్ కి అయితే థమన్ సంగీతం అందిస్తుండగా RRR నిర్మాత డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

352 views