Pawan Kalyan: ప్రధాని మోడీ తర్వాత పవన్ కళ్యాణ్ మాత్రమే..దేశం మొత్తం పవనిజం మేనియా!

Posted by venditeravaartha, June 7, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన అభిమానులకు,పార్టీ కార్యకర్తలకు గత నాలుగు రోజుల నుండి ఊపిరి పీల్చుకునే గ్యాప్ కూడా ఇవ్వకుండా, ఆనందాన్ని పంచుతూనే ఉన్నాడు. 2019 ఎన్నికలలో జనసేన పార్టీ ఘోర పరాజయం చూడడమే కాకుండా, పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్ల కూడా పరాజయం పొంది, ఘోర అవమానం ని ఎదురుకున్నారు. కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు, ఆయనని అభిమానించే కోట్లాది మంది అభిమానులు కూడా ఇతరుల నుండి అవమానాలను ఎగురుకుంటూ వచ్చారు. వాటి అన్నిటికి సమాధానమే జూన్ 4 వ తారీఖున విడుదలైన ఎన్నికల ఫలితాలు. దేశం లోనే కాదు ప్రపంచం లోనే ఒక పార్టీ పోటీ చేసిన అన్నీ స్థానాల్లో గెలవడం అనేది ఎక్కడా జరగలేదు, ఒక్క జనసేన పార్టీ కి తప్ప.

అలాంటి అద్భుతమైన విజయం సాధించి చరిత్రలో నిల్చిపోయిన పవన్ కళ్యాణ్ కేవలం రాష్ట్ర రాజకీయాల్లో మాత్రమే కాకుండా, ఢిల్లీ లో ప్రధానిని ఎన్నుకునే అతి ముఖ్యమైన పది మంది నాయకులలో ఒకరిగా నిలిచారు. 151 స్థానాలు గతం లో గెల్చిన సీఎం జగన్ కి కూడా దక్కని అపూర్వమైన గౌరవం ఇది. జగన్ నిన్ను పాతాళం లోకి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదు అంటూ పవన్ కళ్యాణ్ చెప్పి మరీ జగన్ చావు దెబ్బ తీసి 11 స్థానాలకు మాత్రమే పరిమితం చేసిన విధానం ని మనం సినిమాల్లో కూడా చూడలేం. ఆ స్థాయిలో దెబ్బ కొట్టిన పవన్ కళ్యాణ్ ని ప్రధాని మోడీ కూడా ఎంతో ప్రత్యేకంగా గుర్తించారు. నేడు పార్లమెంట్ లో జరిగిన ఎన్డీయే సమావేశం లో 300 మంది ఎంపీ లు, ముఖ్యమంత్రుల ముందు, ప్రధాని మోడీ తో కలిసి ఒక పది మంది అత్యంత శక్తివంతమైన నాయకులూ కూర్చున్నారు. ఆ అత్యంత శక్తివంతమైన వారిలో ఒక్కరు పవన్ కళ్యాణ్.

ప్రధాని గురించి పార్లమెంట్ లో అద్భుతమైన ప్రసంగం ఇవ్వగా, అనంతరం ప్రధాని పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ‘పవన్ కళ్యాణ్ అంటే గాలి కాదు..ఒక తుఫాన్’ అంటూ ప్రత్యేకంగా కొనియాడారు. ఈ వీడియో ఇప్పుడు దేశమంతటా చక్కర్లు కొడుతోంది. అంత మంది నాయకులూ, దిగ్గజాలు ఉన్న చోట ప్రధాని మోడీ ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గురించి మాలాడడం ని చూస్తుంటే ఆయన స్థాయి ఎంత ఉన్నతమైనదో అర్థం అవుతుంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా సోషల్ మీడియా లో అయినా, నేషనల్ మీడియా లో అయినా ప్రధాని మోడీ తర్వాత దద్దరిల్లిపోతున్న పేరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. రాబొయ్యే రోజుల్లో ఆయన ఎలాంటి పదవి ని అలంకరించబోతున్నారో చూడాలి.

227 views