Pawan Kalyan: ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి పవన్ కళ్యాణ్ ఎలా దూసుకుపోతున్నాడో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఆయన పని తీరుకి ప్రత్యర్థులు సైతం సెల్యూట్ కొట్టే రేంజ్ లో ఉన్నాయి. ఉపముఖ్యమంత్రి బాధ్యతతో పాటుగా, పంచాయితీ రాజ్& గ్రామీణాభివృద్ధి, పర్వావరణం, అటవీ శాఖ, రూరల్ డెవలప్మెంట్ వంటి అత్యంత ముఖ్యమైన శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్న ఆయన, వివిధ దఫాలుగా తన శాఖలపై సమీక్షలు ఏర్పాటు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా అవినీతికి పాల్పడే వారిపై ఆయన ఉక్కుపాదం మోపుతున్నాడు.
రూరల్ డెవలప్మెంట్ కోసం దేశం లో ఎక్కడా లేని పద్దతులను అనుసరించబోతున్న పవన్ కళ్యాణ్, పర్యావరణం పరిరక్షణ మీద కూడా పలు ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ముఖ్యంగా కొన్ని అంశాలపై పవన్ కళ్యాణ్ చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకోబోతున్నాడు. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో వినాయకచవితి ని ఎంత ఘనంగా జరుపుకుంటామో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. చిన్నతనం నుండి వినాయక చవితి వచ్చిందంటే ఎక్కడలేని ఆనందం జనాల్లో ఉంటుంది. అయితే వినాయకుడి బొమ్మలను ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అనే పదార్డతం తో తయారు చేసే సంగతి మన అందరికీ తెలిసిందే. దీనివల్ల నిమర్జనం సమయం లో మంచి నీరు బాగా కలుషితం అవుతుంది.
మట్టి వినాయకులను వాడాలి అంటూ అనేకమార్లు అధికారులు చెప్పినప్పటికీ కూడా, ఎవ్వరూ పట్టించుకోని పరిస్థితి ఉంది. అందుకే పవన్ కళ్యాణ్ పర్యావరణ శాఖా మంత్రిగా రాబొయ్యే వినాయకచవితి కి మట్టి వినాయకులను మాత్రమే వాడాలి అని కొత్త చట్టం తీసుకొని రాబోతున్నాడు. త్వరలోనే ఈ అంశంపై ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు తో చర్చలు కూడా జరపనున్నాడు. చట్టాన్ని ఉల్లంగిస్తే చాలా తీవ్రమైన చర్యలు ఉండేలాగా పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకోనున్నాడు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది.
నేడు మంగళగిరి లోని తన పార్టీ సెంట్రల్ ఆఫీస్ లో మట్టి వినాయకుడిని ప్రతిష్టించాడు. దానికి సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఇకపోతే పర్యావరణం విషయం లో ఇటీవలే అధికారుల చేత నూతన పద్దతులను తెలుసుకున్న పవన్ కళ్యాణ్, ముందుగా పిఠాపురం మరియు భీమవరం లో ప్రయోగించబోతున్నాడు. ఇక్కడ సక్సెస్ అయితే రాష్ట్రవ్యాప్తంగా పర్యావరణం విషయం లో ఈ నూతన పద్దతులను అవలంబించి పారిశుద్యంగా రాష్ట్రాన్ని ఉంచేందుకు చర్యలు చేపట్టనున్నారు.