Pawan Kalyan: సినీ స్టార్స్ ఇతర వ్యాపారాల్లో, ఇతర రంగాల్లో ఉండడం కొత్తేమి కాదు. మొదటి నుండి ఇది జరుగుతున్నదే. ప్రస్తుతం ఉన్న హీరోలు కూడా అత్యధికంగా ఇతర వ్యాపకాల్లో ఉంటున్నారు. ఉదాహరణకి మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి వారిని తీసుకోవచ్చు. అలాగే బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్, ప్రీతి జింటా వంటి వారిని తీసుకోవచ్చు. వీళ్లిద్దరికీ స్వతహాగా ఐపీఎల్ టీమ్స్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సీజన్ లో షారుఖ్ ఖాన్ యజమాని గా వ్యవహరిస్తున్న కోల్ కత్తా నైట్ రైడర్స్ టీం ట్రోఫీ గెలిచిన సంగతి కూడా మనమంతా చూసాము. ఇది ఇలా ఉండగా మన రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కేవలం సన్ రైజర్స్ హైదరాబాద్ టీం మాత్రమే ఉంది. మన ఆంధ్ర నుండి ఒక్క టీం కూడా ఐపీఎల్ లో లేకపోవడం గమనార్హం.
మహేష్ బాబు, రామ్ చరణ్ వంటి వారు వైజాగ్ కి సంబంధించి కొత్త ఐపీఎల్ టీం ని పెట్టబోతున్నారు అంటూ గతంలో వార్తలు వచ్చాయి. కచ్చితంగా వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఐపీఎల్ టీం ని స్థాపిస్తారు అనుకున్నారు కానీ అది జరగలేదు. కానీ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరుపున వైజాగ్ కి సంబంధించి ఐపీఎల్ టీం ని పెట్టించే ఆలోచనలో ఉన్నాడట. జూన్ 4 వ తేదీన టీడీపీ+ జనసేన ప్రభుత్వం రాబోతుందని దాదాపుగా ఖరారు అయ్యింది. ఏ సర్వే తీసుకున్న ఇదే చెప్తున్నారు. యువత లోని ప్రతిభ ని గుర్తించి, వారికి ఇష్టమైన రంగాల్లో స్కిల్ డెవలప్మెంట్ చేసి చూపిస్తాం అని చెప్పుకొచ్చిన పవన్ కళ్యాణ్, దానికి తొలి అడుగుగా ఈ ఐపీఎల్ టీం ని ప్రభుత్వం తరుపున స్థాపించబోతున్నారు. అయితే ఈ టీం కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ టీం లో అంతర్జాతీయ క్రికెటర్లు ఉంటారా?, లేదా టాలెంట్ ఉన్న కొత్త కుర్రాళ్లను ఎంచుకుంటారా అనేది తెలియాల్సి ఉంది.
ఈ టీమ్ స్థాపన కోసం అంబటి రాయుడు సహాయసహకారాలు కూడా తీసుకోబోతున్నారట పవన్ కళ్యాణ్. అంబటి రాయుడు ప్రస్తుతం జనసేన పార్టీ నాయకుడిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలలో ఆయన జనసేన పార్టీ తరుపున ప్రచారాల్లో కూడా పాల్గొన్నారు. ప్రభుత్వం స్థాపించిన వెంటనే క్రీడలకు సంబంధించి అంబటి రాయుడు సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారట. మొత్తానికి ఆంధ్ర ప్రదేశ్ కి సంబంధించి ఒక కొత్త ఐపీఎల్ టీం ప్రభుత్వం తరుపున రాబోతుంది అనే వార్త ఇప్పుడు క్రికెట్ అభిమానులను ఎంతో ఉత్సాహ పరుస్తుంది, మరి ఇది ఎంత వరకు కార్యరూపం దాలుస్తుందో రాబొయ్యే రోజుల్లో చూడాలి.