Pawan Kalyan : పవన్ కళ్యాణ్ మొదటి భార్య కొడుకు ఎలా ఉన్నాడో చూస్తే మెంటలెక్కిపోతారు..సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడా?

Posted by venditeravaartha, October 15, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

పవన్ కళ్యాణ్ వ్యక్తి గత జీవితం తెరిచినా పుస్తకం లాంటిది అనే విషయం మన అందరికీ తెలిసిందే. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తల్లోనే ఆయనకీ వైజాగ్ ప్రాంతానికి చెందిన నందిని రెడ్డి అనే అమ్మాయితో పెళ్లి చేసారు. రెండేళ్లు వీళ్ళ దాంపత్య జీవితం సజావుగా సాగినా, ఎందుకో మధ్యలో విభేదాలు ఏర్పడడం తో విడిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ బద్రి సినిమా షూటింగ్ సమయం లో రేణు దేశాయ్ ని ప్రేమించి , ఆమెతో కొన్నాళ్ళు డేటింగ్ చేసిన తర్వాత పెళ్లి చేసుకున్నాడు. ఈమెతో దాదాపుగా పదేళ్ల పాటు కలిసి దాంపత్య జీవితం కొనసాగించిన పవన్ కళ్యాణ్ , మధ్యలో కొన్ని అభిప్రాయం బేధాలు రావడం వల్ల మళ్ళీ విడిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత అన్నా లెజినోవా ని పెళ్ళాడి ప్రస్తుతం ఆమెతోనే జీవితం గడుపుతున్నాడు. రేణు దేశాయ్ ఇప్పటికీ సోషల్ మీడియా లో యాక్టీవ్ గా ఉంటుంది.

కానీ పవన్ కళ్యాణ్ మొదటి భార్య నందిని రెడ్డి మాత్రం ఇప్పటి వరకు మీడియా ముందుకు రాలేదు. అప్పట్లో పవన్ కళ్యాణ్ తో కలిసి ఆమె బయట తిరిగిన సందర్భాలు కూడా చాలా తక్కువే. పవన్ కళ్యాణ్ తో విడాకులు తీసుకున్న తర్వాత, ఆమె వైజాగ్ చెందిన ఒక డాక్టర్ ని పెళ్ళాడి విదేశాల్లో స్థిరపడినట్టు తెలుస్తుంది. ఈమెకి ఒక పాప మరియు ఒక బాబు ఉన్నాడట. ఇద్దరూ కూడా అకిరా నందన్ కంటే వయస్సులో పెద్దవాళ్లట, మంచి ఫిజిక్ మరియు అందం కలిగి ఉన్నవారట. కొడుకుకి సినిమాలు అంటే మొదటి నుండి ఎంతో మక్కువ ఉండేదట. అందుకే అతను తన చదువులు మొత్తం పూర్తి చేసుకొని త్వరలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారని టాక్. పవన్ కళ్యాణ్ తో నందిని రెడ్డి విడిపోయినప్పటికీ ఒక స్నేహితురాలిగా అప్పుడప్పుడు పలకరిస్తూనే ఉంటుందట.

మరి ఆమె కొడుకు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ సపోర్ట్ తీసుకోబోతుందా?, లేదా తన భర్త కి ఉన్న కాంటాక్ట్స్ తోనే తన కొడుకుని ఇండస్ట్రీ లోకి లాంచ్ చేస్తుందా అనేది చూడాలి. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియా ని ఒక రేంజ్ లో ఊపేస్తోంది. ఇకపోతే పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా నందన్ కి కూడా సినిమాల్లో ఎంట్రీ ఇవ్వాలని కోరిక ఉంది కానీ, అతనికి నటన పట్ల ఆసక్తి లేదని, స్క్రిప్ట్ రైటింగ్ మరియు మ్యూజిక్ మీద అమితాసక్తి ఉందని రేణు దేశాయ్ పలు సందర్భాల్లో తెలిపింది. కానీ తనకు మాత్రం అకిరా ని నటుడిగా చూడాలని కోరిక ఉంది అంటూ రీసెంట్ గానే కామెంట్ చేసింది రేణు దేశాయ్.

5625 views