పవన్ కళ్యాణ్ క్రేజ్ కి సరిహద్దులు లేవు అని ఆయన అభిమానులు అంటూ ఉంటారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, ఇతర రాష్ట్రాల్లో కూడా పవన్ కళ్యాణ్ కి వీరాభిమానులు ఉంటారు, ఆయన సరైన ప్లానింగ్ తో పాన్ ఇండియన్ సినిమా చేస్తే టాలీవుడ్ లో ఆయనని మించిన పాన్ ఇండియన్ స్టార్ లేడు అని ట్రేడ్ పండితులు సైతం అంటూ ఉంటారు. అయితే పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తర్వాత ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నీ రీమేక్ సినిమాలే. స్టార్ హీరోలందరూ పాన్ ఇండియన్ సినిమాలతో దూసుకుపోతుంటే, పవన్ కళ్యాణ్ మాత్రం రీమేక్ సినిమాలతో సరిపెడుతున్నాడని, ఇది ఆయన రేంజ్ కి తగ్గ పనులు కావని అభిమానుల అభిప్రాయం. కానీ పవన్ కళ్యాణ్ నుండి రాబొయ్యే తదుపరి సినిమాలన్నీ పాన్ ఇండియన్ సినిమాలే. ‘ఓజీ’ మరియు ‘హరి హర వీరమల్లు’ సినిమాల కోసం అభిమానులతో పాటుగా ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు.
ఇదంతా పక్కన పెడితే నిన్న అలహాబాద్ లో ఇండియా మరియు పాకిస్థాన్ మధ్య నువ్వా నేనా అనే రేంజ్ లో పోటీ జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ హోరాహోరీ పోరులో ఇండియా పాకిస్థాన్ ని చిత్తూ చిత్తూ గా ఓడించి టేబుల్ టాపర్స్ గా నిల్చింది. అయిన నిన్న మ్యాచ్ మొత్తం లో ఎక్కువగా పవన్ కళ్యాణ్ మేనియా బాగా కనిపించింది. ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అని ఒపీనియన్ పోల్ ఆడియన్స్ కి పెట్టినప్పుడు, అత్యధిక శాతం మంది సమాదానాలు ఇచ్చిన వాళ్ళు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అట. ఈ విషయాన్నీ రన్నింగ్ కామెంటరీ లో కూడా చెప్పారు. అలాగే స్టేడియం లో జనసేన జండాలు చాలానే కనిపించాయి. సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా ఈ ఫొటోలే కనిపిస్తున్నాయి. పవనిజం మేనియా ని చూసి అలహాబాద్ జనాలు కూడా షాక్ కి గురి అయ్యారు.
వీటిని చూసి పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియా లో ఆయన సరిగ్గా ఫోకస్ చేస్తే పాన్ ఇండియా లెవెల్ లో అందరి హీరోలకు వణుకు పుట్టిస్తాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రాబొయ్యే సినిమాలతో పవర్ స్టార్ పాన్ ఇండియన్ స్టార్ స్టేటస్ ప్రతీ ఒక్కరికి తెలుస్తుంది అంటూ సోషల్ మీడియా లో పోస్టులు పెడుతున్నారు. ఇక పోతే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం పై పూర్తి స్థాయి ఫోకస్ పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే మూడు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 20 వ తారీఖు నుండి నాల్గవ షెడ్యూల్ ని ప్రారంభించుకోబోతుంది.