Pawan kalyan: ఆమెకు క్షమాపణలు చెప్పిన పవన్..

Posted by venditeravaartha, July 13, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

టాలీవుడ్ ఇండస్ట్రీలో పవన్ కల్యాణ్ అంటే క్రేజీ. ఆయన సినిమాలంటే థియేటర్లలో కోసుకుంటారు. అంతటి అభిమానం ఉన్న వారి పవన్ ఇటీవల రాజకీయాల్లోనూ స్పీడ్ పెంచారు. జనసేన అధినేతగా ఉన్న ఆయన వరుస సభలు, మీటింగులతో బిజీ అవుతున్నారు. రాజకీయాలన్నాక విమర్శలు, ప్రతి విమర్శలు ఉంటాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలు ఉంటాయి. కానీ అధికార వైసీపీ చేస్తున్న విమర్శలపై పవన్ ఒక దశలో కన్నీళ్లు పెట్టుకోవాల్సి వచ్చింది. వైసీపీ నాయకులు పదే పదే పవన్ ను మూడు పెళ్లిళ్ల ప్రస్తావన తీసుకురావవడంతో ఆయన తీవ్రంగా బాధపడినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తన వల్ల తన మూడో భార్య పడుతున్న ఆవేదనకు తాను క్షమాపణ కూడా చెప్పాడు. ఇప్పుడీ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

pk

2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా తన ప్రతాపం చూపించాలని పవన్ రాజకీయాలపై ఫోకస్ పెట్టాడు. దీంతో తీరిక లేకుండా ప్రజల్లో తిరుగుతున్నారు. గత కొన్నేళ్లుగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించిన ఆయన ఇప్పుడు సభలు పెట్టి అధికార పార్టీ చేస్తున్న తప్పులను బయటపెడుతున్నారు. ఈ క్రమంలో ఆయన కాస్త స్వరం పెంచి ఘాటుగానే సీఎం జగన్ ను విమర్శిస్తున్నారు. అయితే పవన్ విమర్శలు, ఆరోపణలు రాజకీయంగానే ఉంటున్నాయని జనసేన కార్యకర్తలు అంటున్నారు. కానీ వైసీపీ నాయకులు మాత్రం ప్రతీసారి పవన్ కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేస్తున్నారు.

kalyan

తాజాగా ఆయన దెందులూరు నియోజకవర్గంలో పర్యటించిన సందర్భంగా మహిళలతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘నాపై వైసీపీ నాయకులు వ్యక్తిగత విమర్శలు చేస్తుంటే బాధగా ఉంది. నాకు పిల్లలు ఉన్నారు. వారి ఇలాంటి వ్యాఖ్యలు వింటే బాధపడుతారు. అయినా నేను వారికి సర్ది చెబుతున్నా.. రాజకీయాల్లోకి వచ్చాక ఇలాంటివి ఉంటాయని నా భార్యకు చెప్పినా. నేనొక విప్లవకారుడిని ఆంధ్రప్రదేశ్ ను తట్టి లేపుతున్నాను. ఎట్టి పరిస్థితులు ఎదురైనా ముందుకు వెళ్లాల్సిందే అని నా భార్యతో చెప్పాను’అని అన్నారు.

pk and wife

ఇక తన భార్య గురించి మాట్లాడుతూ.. ‘ఎవరైన ఏదైనా అంటే బాధపడుతారు. అలాంటిది నా భార్య ఇలాంటి పరిస్థితుల్లో బాధపడదని నేను అనలేం. అందువల్ల నేను ఆమెకు క్షమాపణలు చెబుతున్నా.. జనం కోసం ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నప్పుడు ముందుకే వెళ్లాలి. తప్పదు ’ అని తన భార్యకు చెప్పారు. ఈ సందర్భంగా అక్కడున్న మహిళలు పవన్ చెప్పిన మాటలను ఆసక్తిగా విన్నారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

2113 views