Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వరుసగా నాలుగు సినిమాల ఫ్లాప్ తర్వాత సలార్ సినిమాతో కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఇక సలార్ హిట్ తర్వాత ప్రభాస్ తన తదుపరి చిత్రం కల్కి 2898 ADతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. రీసెంట్ గా ప్రభాస్ కి సంబంధించిన ఓ కీలక షెడ్యూల్ కూడా పూర్తయింది. ఈ షెడ్యూల్ తర్వాత ప్రభాస్ కాస్త గ్యాప్ తీసుకుని లండన్ వెళ్లినట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా ప్రభాస్ లండన్ లో కాలికి శస్త్ర చికిత్స చేయించుకుంటున్న సంగతి తెలిసిందే. షూటింగ్‌లో చిన్న గ్యాప్ వచ్చినా లండన్‌కు వెళ్లేస్తున్నాడు ప్రభాస్. ప్రతిసారీ హోటళ్లలో ఉండలేక ప్రభాస్ లండన్‌లో అద్దె ఇల్లు తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
అన్ని సౌకర్యాలతో కూడిన విలాసవంతమైన ఇంటిని డార్లింగ్ ప్రభాస్ అద్దెకు తీసుకున్నాడు. చికిత్స జరిగే వరకు ఆ ఇంట్లోనే ఉంటారని సమాచారం. ఇక ఆ ఇంటి అద్దె నెలకు దాదాపు రూ. 60 లక్షలు అని వినిపిస్తోంది. పాన్ ఇండియా స్టార్ కి ఇంత పెద్ద మొత్తం కాకపోయినా.. ఆ రేటు చూసి ఫ్యాన్స్ షాక్ అవుతారు. దీంతో చిన్న ఇల్లు ఏకంగా కొనేయొచ్చు.. ఇంత అద్దె ఎందుకు అని కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే ప్రభాస్ లండన్ లోనే కొన్నిరోజులు ఉండనున్నాడు. ఇండియా తిరిగి వచ్చిన తర్వాత కల్కి షూటింగ్ లో పాల్గొంటాడని తెలుస్తోంది. ఇక ఇది కాకుండా రాజాసాబ్ సినిమాను కూడా పూర్తి చేసే పనిలో ఉన్నాడట ప్రభాస్. మరి ఈ సినిమాలతో మరోసారి ప్రభాస్ ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.