Pallavi Prasanth: బిగ్ బాస్ విన్నర్ గా అందరికీ పరిచయం అయిన పల్లవి ప్రశాంత్. రైతు బిడ్డ ని సెలబ్రిటీగా మార్చింది మన బిగ్ బాస్ అని చెప్పచ్చు . బిగ్బాస్ ఏడవ సీజన్లో రైతుబిడ్డగా ఎంట్రీ ఇచ్చి తన ఆటపాటలతో అందరి మన్ననలు పొందిన పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ విన్నర్ గా గెలిచి అందరి ముందు సెలబ్రిటీగా నిలబడ్డాడు. పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ విన్నర్ గా గెలిచిన తర్వాత కొన్ని గొడవల కారణంగా అరెస్టు అయ్యి బెయిల్ పై బయటికి రావడం జరిగింది అయితే రీసెంట్గా పల్లవి ప్రశాంత్ స్పీచ్ ఒకటి వైరల్ అవుతుంది ఇప్పుడు ఆ కథ ఏంటో చూద్దాం.
రైతు బిడ్డ అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదు అంటూ బిగ్ బాస్ లో తన నటన విశ్వరూపాన్ని చూపించి విన్నర్ గా గెలిచాడు ప్రశాంత్ . తాజాగా బిగ్ బాస్ కంటెంట్ ప్రిన్స్ హీరోగా నటించిన ఒక మూవీ ఈవెంట్లో ప్రశాంత్ తన మనసులో మాటని బయట పెట్టాడు. ఈమధ్య ప్రశాంత్ చేసే రీల్స్ కొన్ని చూస్తే మనకు కూడా ప్రశాంత్ అన్న మాటల్లో నిజం ఉంది అనిపిస్తుంది. ఇన్స్టాగ్రామ్ లో సోషల్ మీడియాలో, రాజకీయాలకు సంబంధించిన సాంగ్స్ పెట్టుకొని రిలీజ్ చేస్తున్నాడు ప్రశాంత్ ఇదంతా ఏదో ఊరికే చేస్తున్నాడు అనుకుంటే పొరపాటే దాని వెనుక ఉన్న తన మనసులో మాటను బయట పెట్టాడు ప్రశాంత్.
ప్రశాంత్ మాట్లాడుతూ మనల్ని మనం నమ్ముకోవాలి దేవుని నమ్మిన వారు ఎప్పుడూ చెడిపోరు. ఆ భగవంతుడు కాపాడుతాడు ఏ కష్టంలో ఉన్న దేవుడి మీద భారం వేస్తే ఏదో ఒక రూపంలో మనల్ని కాపాడుతూ మన వెంటే ఉంటాడు. నాకు కూడా శివాజీ అనే రూపంలో తోడుగా ఉంటాడు అని దెబ్బలు ఎన్ని తగిలినా కానీ ఎదురు నిలబడాలి అలా నిలబడి నేను ఈ స్థాయికి వచ్చాను అని ఇప్పుడు మీ ముందుకు ఇలా రావడానికి నేను ఎంతో కష్టపడ్డానని చెప్పుకొచ్చాడు. ఇక అదే ఈవెంట్ కి వచ్చిన శివాజీ పక్కనే ఉండి పార్లమెంట్ కి కూడా వెళ్లేలా ఉన్నాడు మన పల్లవి ప్రశాంత అనగానే అవును మీ అందరి ఆశీస్సులు ఉంటే అది కూడా జరుగుతుంది యువత అన్నిట్లో ముందుండాలి. అలాగే రాజకీయాల్లో కూడా ముందుండాలి అని మాట్లాడాడు దీని ప్రకారం చూస్తే ప్రశాంత్ పొలిటికల్ ఎంట్రీ నిజమవుతుందేమో అనిపిస్తుంది.