Indra movie: బాహుబలి కూడా బద్దలు కొట్టలేని రికార్డు ఇంద్ర కి మాత్రమే సాధ్యం.

Posted by venditeravaartha, July 24, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

ఒక రాష్ట్రానికి సీఎం అవడం ఈజీ ఏమో కానీ మెగాస్టార్ చిరంజీవి అవడం చాల కష్టం అని చాల మంది అంటారు.రామారావు ,నాగేశ్వర రావు ,కృష్ణ ,శోభన్ బాబు ,కృష్ణం రాజు వంటి లెజెండరీ స్టార్ హీరో లు ఇండస్ట్రీ ని ఏలుతున్న సమయం లో తన స్వయం కృషి తో ఇండస్ట్రీ లోకి వచ్చిన చిరంజీవి గారు మొదట్లో చిన్న చిన్న క్యారెక్టర్ లు ,విలన్ గా చేసిన ఆ తర్వాత ఇండస్ట్రీ అంత తన వైపు చూసేలా చేసారు.మూడు దశబ్దాలు టాలీవుడ్ టాప్ హీరో గా ఉన్న చిరంజీవి గారు రాజకీయాల వలన 9 సంవత్సరాలు గ్యాప్ వచ్చినప్పటికి ఆయన స్థానం ని ఎవరు కూడా టచ్ చేయాలి స్టాండర్డ్స్ ని సెట్ చేసి వెళ్లారు.తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ లు ఉన్నప్పటికీ ఇంద్ర సినిమా తో ఇప్పటి ఇండస్ట్రీ హిట్ అయినా బాహుబలి సైతం కూడా టచ్ చేయలేని రికార్డు లను సాధించారు.

indra

బావగారు బాగున్నారా సినిమా తర్వాత మంచి కమర్షియల్ మాస్ సినిమా కోసం ఎదురు చుసిన చిరంజీవి గారికి  చిన్ని కృష ,పరుచూరి బ్రదర్స్ గారు చెప్పిన కథ బాగా నచ్చడం తో రాయలసీమ యాక్షన్ ల కి కేర్ అఫ్ అడ్రెస్స్ అయినా బి గోపాల్ గారిని డైరెక్టర్ గా సెలెక్ట్ చేసుకున్నారు.మెగా ప్రొడ్యూసర్ అశ్వినీదత్ గారి వైజయంతి మూవీస్ లో మణిశర్మ మ్యూజిక్ డైరెక్టర్ గా 2002 జులై 24 న ఇంద్ర సినిమా రిలీజ్ అయింది.మెగా ఫ్యాన్స్ తో పాటు సగటు సినిమా ప్రేక్షకుడు సైతం ఎంజాయ్ చేసేలా బి గోపాల్ గారు ఇంద్ర అందించారు.మూవీ రిలీజ్ అయ్యి 21 సంవత్సరాలు అవుతున్నా ఇంద్ర కి ఉన్న క్రేజ్ ఇంచ్ కూడా తగ్గలేదు.

indra songs

తన సినిమా కెరీర్ లో మొదటి సారి ఫ్యాక్షన్ మూవీ చేసిన చిరంజీవి గారు తన లో ఉన్న నటన ని పూర్తి స్థాయి లో చూపించారు.ఫస్ట్ హాఫ్ వరకు కాశీ లో కామెడీ ,మంచి పాటలు ,డాన్స్ ల తో తీసుకుని వెళ్లిన డైరెక్టర్ ఇంటర్వెల్ లో ఇచ్చిన ట్విస్ట్ తో థియేటర్ అంతటా విజిల్స్ ల తో ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు ,ఇక సెకండ్ హాఫ్ లో చిరంజీవి గారి నట విశ్వరూపం చూస్తాం
ఇంద్ర సినిమా కి మణిశర్మ గారి మ్యూజిక్ ఎంతగానో ప్లస్ అయింది.ఇక అప్పటి వరకు తెలుగు లో ఇండస్ట్రీ హిట్ గా ఉన్న నరసింహనాయుడు కలెక్షన్ ల ని బ్రేక్ చేసి ఇంద్ర ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.ఇక అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆద్వర్యం లో చేసిన ఇంద్ర 175 డేస్ ఫంక్షన్ ని చూస్తే ఇంద్ర సినిమా స్థాయి ,రేంజ్ ఏంటో తెలుస్తుంది.

indra

1928 views