Okkadu:ఒక్కడు సినిమాలో మహేష్ బాబు చెల్లిగా నటించిన ఈమె ఇప్పుడు ఎంత హాట్ గా తయారరైందో చూసారా!

Posted by venditeravaartha, March 25, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

Mahesh Babu: మహేష్ బాబు సినీ కెరియర్ లోనే ఒకడు సినిమా సూపర్ హిట్ గా నిలిచింది ఈ మూవీ మహేష్ కెరియర్ లోనే ది బెస్ట్ హిట్ అండ్ బాగా వసూలుగా చేసిన సినిమా కూడా ఇదే, ఈ మూవీ హీరోయిన్ గా భూమిక నటించారు. గుణశేఖర్ దర్శకత్వంలో ఈ సినిమా తర్కెక్కింది. ఇక ఈ మూవీ అప్పట్లో ఒక సెన్సేషన్ యువతను బాగా ఆకట్టుకుంది లేడీ ఫ్యాన్స్ ని మహేష్ కి పెంచింది కూడా ఈ మూవీ ఈ మూవీలో మహేష్ ఒక పోలీస్ ఆఫీసర్ కొడుకుగా చాలా అద్భుతంగా నటించాడు. ఈ మూవీలో ప్రతి ఒక్కళ్ళ క్యారెక్టర్ గుర్తుండిపోయేటట్టుగా ఉంటుంది. ఈ మూవీ మహేష్ చెల్లెలుగా ఆశ అనే క్యారెక్టర్ లో నటించిన నటి గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం.

చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి వచ్చి చాలామంది హీరో హీరోయిన్స్ గా రాణిస్తున్నారు చెల్లెలిగా కూతురుగా హీరోల పక్కన నటిస్తూ ఆ తర్వాత మంచి అవకాశం రాగానే వెండితెరపై నటిస్తూ కొంతమంది సక్సెస్ అయ్యారు కొంతమంది సక్సెస్ కాలేకపోయారు. అసలు కొంతమంది ఇండస్ట్రీకి దూరంగా కూడా అప్పట్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా వచ్చిన ఆలీ ఆ తర్వాత ఎంత పెద్ద కమెడియన్ అయ్యారో మనందరికీ తెలిసిందే. అలాగే మహేష్ బాబు చెల్లెలిగా బ్రహ్మోత్సవం సినిమాలో అవంతిక నటించింది ఇప్పుడు ఆమె బాలీవుడ్ లో హీరోయిన్గా రాణిస్తున్నారు ఇక హీరోలు కూడా అంతే తేజసజ్జ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇంద్ర సినిమాలో నటించి ఇప్పుడు హీరోగా తెలుగు ఇండస్ట్రీ లో పాతుకుపోయాడని చెప్పొచ్చు అలానే చాలామంది హీరోలు చైల్డ్ ఆర్టిస్టులుగా వచ్చి హీరోలుగా చాలామంది హీరోయిన్స్ కూడా చైల్డ్ ఆర్టిస్టులుగా వచ్చి ఇప్పుడు వెండి తెర మీద మరియు బుల్లితెర మీద కూడా నటిస్తున్నారు.

ఇక ఒక్కడు సినిమాలో మహేష్ చెల్లెలిగా ఆశ అనే క్యారెక్టర్ లో నటించిన అమ్మాయి పేరు నిహారిక ఈ మూవీలో అల్లరి చేస్తూ అన్నని ఆటపట్టించే క్యారెక్టర్ లో నిహారిక అద్భుతంగా నటించారు ఆశ అనే క్యారెక్టర్ లో ఆమె జీవించిందని చెప్పొచ్చు చాలాకాలం ఆమె ఆశగా గుర్తుండిపోయింది. ఇప్పుడు ఈ భామా పూర్తిగా మారిపోయింది ఒక్కడు మూవీ తర్వాత మోహన్ బాబు యమజాతకుడు సినిమాతో వెంకటేష్ ప్రేమించుకుందాం రా సినిమాలో నటించి తర్వాత తన చదువు మీద దృష్టి పెట్టి సినిమాలకు దూరంగా ఉన్నారు నిహారిక కొంతకాలం తర్వాత పెళ్లి చేసుకొని నిహారిక ఇండస్ట్రీలో ఎక్కడా కనిపించలేదు ఇక ఇప్పుడు తన ఫొటోస్ కొన్ని సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి ఈ భామను చూసినవారు పూర్తిగా మారిపోయింది నిహారిక అని అంటున్నారు ఇక ఈమె హీరోయిన్గా కూడా నటించొచ్చు అని అభిమానులు వారి అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు. చిన్నప్పుడు మహేష్ బాబు చెల్లెలుగా ఆశా క్యారెక్టర్ లో నటించిన ఈ భామ ఇప్పుడు పూర్తి డిఫరెంట్ లుక్ లో హీరోయిన్ ని మించిన అందంతో కనిపిస్తుండడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

811 views