Nuvve kavali: ఇండస్ట్రీ హిట్ నువ్వే కావాలి సినిమా ని మిస్ చేసుకున్న ఆ హీరో ఎవరో తెలుసా !

Posted by venditeravaartha, May 19, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

తెలుగు సినిమా ల లో ఇప్పటి వరకు వచ్చిన ప్రేమ కథ ల లో నువ్వే కావాలి(Nuvve kavali) సినిమా కి సెపెరేట్ స్టైల్ ఉంది.మలయాళ లో రిలీజ్ అయినా నేరం సినిమా కి రీమేక్ ఇది .ఒరిజినల్ సినిమా కి చాల మార్పులు చేసి తెలుగు లోకి కొత్తగా తీసుకుని వచ్చారు రచయత త్రివిక్రమ్(Trivikram) మరియు డైరెక్టర్ విజయ భాస్కర్(Vijaya bhaskar).బాల నటుడు గా ఎన్నో సూపర్ హిట్ సినిమా లో లో నటించిన తరుణ్(Tarun) ఈ సినిమా ద్వారా హీరో గా పరిచయం అయ్యారు.తరుణ్ కి జోడి గా రిచా నటించారు.ఈ చిత్రాన్ని ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు నిర్మించగా, స్రవంతి రవికిషోర్ ఎక్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి రచయిత. కోటి సంగీతం అందించారు.

నువ్వే కావాలి సినిమా 13 అక్టోబర్ 2000 వ సంవత్సరం రిలీజ్ అయింది.మొదటి రోజు నుంచే మంచి పాజిటివ్ టాక్ రావడం ,అప్పట్లో యువత ని మంచిగా ఆకట్టుకుంది.కోటి అందించిన మ్యూజిక్ ఈ సినిమా కి హైలైట్ అని చెప్పాలి.ఆ సంవత్సరం రిలీజ్ అయినా సినిమా ల లో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమా గా నువ్వే కావాలి రికార్డు సృష్టించింది.

అయితే మొదట ఈ సినిమా ని తరుణ్ తో కాకుండా సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh babu) తో తీయాలి అనుకున్నారు ఒరిజినల్ మలయాళ మూవీ ని మహేష్ బాబు కి కూడా చూపించారు అంట అయితే అప్పటికే యువరాజు ,వంశి సినిమా ల తో బిజీ గా ఉన్న మహేష్ బాబు నువ్వే కావాలి సినిమా ని చేయలేకపోయారు.ఇక ఆ తర్వాత హీరో సుమంత్(Sumanth) ని నువ్వే కావాలి సినిమా చేయమని అడగక అయన కూడా యువకుడు ,పెళ్లి సంబంధం సినిమా ల తో బిజీ గా ఉండటం తో ఆ అవకాశం తరుణ్ కి వెల్లింది .మొదటి సినిమా తోనే బ్లాక్ బస్టర్ అందుకున్నారు తరుణ్.మరి ఇదే సినిమా ని మహేష్ కానీ సుమంత్ కానీ తీసి ఉంటె ఎలా ఉండేదో కామెంట్ ల లో తెలియాజేయండి.

2574 views