NTR: ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ మరో ఆచార్య కానుందా ?

Posted by venditeravaartha, May 20, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

జూనియర్ ఎన్టీఆర్(Jr.Ntr) ,కొరటాల శివ(Koratala shiva) కలయిక లో 2016 లో రిలీజ్ అయినా జనతా గ్యారేజ్(Janatha garage) ఎంత పెద్ద హిట్ సాధించిందో మనకి తెలుసు ఇప్పుడు 7 సంవత్సరాల గ్యాప్ తర్వాత వీరి కలయిక లో మరో మూవీ రానుంది మే 20 న జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా టైటిల్ ,ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసారు,ఎన్టీఆర్ కెరీర్ లో 30 వ చిత్రం అయినా ఈ సినిమా కి ‘దేవర'(Devara) అని టైటిల్ ఫిక్స్ చేసారు,ఈ సముద్రం ఇతని స్టోరీస్ ల తో నిండి ఉంది అయితే అవి అన్ని శత్రువుల రక్తం తో పోస్టర్ లో రాసి ఉంటడం తో కొరటాల శివ చెప్పినట్లు కొంత మంది మానవ మృగాలకి ఎన్టీఆర్ కి మధ్య జరిగే యుద్ధం లా ఈ సినిమా ఉండబోతుంది అని అర్ధం అవుతుంది.

దేవర మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది ఈ సినిమా లో బాలీవుడ్ నటి జానహ్వి కపూర్(Jahnvi kapoor) హీరోయిన్ గా చేస్తుండగా సైఫాలీఖాన్(Saif alikhan) విల్లన్ గా కనిపించనున్నారు..మ్యూజిక్ సెన్సషనల్ అయినా అనిరుద్ రవిచంద్రన్(Anirudh ravichandran) సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ ,యువసుధ ఆర్ట్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.2024 ఏప్రిల్ 5 న పాన్ ఇండియన్ లెవెల్ లో రిలీజ్ కానున్న దేవర సినిమా కి కొరటాల శివ ఆల్ టైం డిజాస్టర్ ‘ఆచార్య'(Acharya) మూవీ సెంటిమెంట్ భయం ఉంది అంటున్నారు.మెగాస్టార్ చిరంజీవి ,రామ్ చరణ్ కలయిక లో భారీ అంచనాలతో వచ్చిన ఆచార్య డిజాస్టర్ అయింది.చిరంజీవి కెరీర్ లో అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచింది.

ఆచార్య మూవీ లో ధర్మస్థలి అనే ఒక ఊరిని ప్రధాన అంశముగా తీసుకుని అక్కడ జరుగుతున్న పరిస్థితులు ,ఆ ఊరి వారికీ ఉన్న సమస్యల నుంచి హీరో ఎలా కాపాడాడు అనే కథ తో వచ్చిన ఆచార్య సినిమా లాగానే దేవర సినిమా లోను ఎన్టీఆర్ సముద్రానికి రాజు ల ఉంటూ అక్కడ జరుగుతున్న అన్యాయాలను ఎదిరించి అక్కడ ప్రజలకి ఎలా అండగా నిలబడ్డాడు అనేది ప్రధాన కథ అని సినిమా డైరెక్టర్ కొరటాల శివ చెప్పారు..జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో మరో డ్యూయల్ రోల్ లో కనిపిస్తున్నా ఈ సినిమా ఎన్టీఆర్ గారికి ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో వేచి చూడాలి..ఆచార్య లాంటి డిజాస్టర్ నుంచి కొరటాల శివ బయటకు వచ్చి దేవర తో బ్లాక్ బస్టర్ కొట్టాలి అని ఎన్టీఆర్ అభిమానులు ఎదురు చూస్తున్నారు.

5026 views