NTR : అమల చేసిన ఆ పని వల్ల జూనియర్ ఎన్టీఆర్ ఇంత నష్టపోయాడా?

Posted by venditeravaartha, September 26, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

సౌత్ ఇండియా లో ఒకప్పుడు బిగ్గెస్ట్ స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ అమల. తమిళం లో మంచి గుర్తింపు దక్కించుకున్న ఈమె, తెలుగు లో కూడా పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. అలా అక్కినేని నాగార్జున తో శివ సినిమా చేసింది. ఈ సినిమా షూటింగ్ సమయం లోనే ఇద్దరు మనసులు కలిసాయి. ఆ తర్వాత పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అమల నాగార్జున ని పెళ్లి చేసుకునే సమయానికి కెరీర్ లో పీక్ రేంజ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంది. మెగాస్టార్ చిరంజీవి తో కూడా ఆమె ఒక సినిమాలో నటించింది. అలాంటి సమయం లో నాగార్జున ని పెళ్ళాడి హీరోయిన్ పాత్రలకు గుడ్ బాయ్ చెప్పేసింది. ఆ తర్వాత అప్పుడప్పుడు మనసుకి నచ్చే క్యారక్టర్ ఆర్టిస్టు పాత్రలు పోషిస్తూ ఉంటుంది అమల. వివాదాలకు ఎప్పుడూ దూరంగా ఉండే అమల, యంగ్ టైగర్ ఎన్టీఆర్ విషయం లో మాత్రం చాలా దారుణంగా వ్యవహరించింది అంటూ సోషల్ మీడియా లో ఒక వార్త ప్రచారం అవుతుంది.

అమల ఎన్టీఆర్ కి అన్యాయం చెయ్యడం ఏమిటి?, అసలు ఎన్టీఆర్ కి అమలకి సంబంధం ఏమిటి అని ఆలోచిస్తున్నారా..?, ఆ పాయింట్ కే వస్తున్నాం. అక్కినేని ఫ్యామిలీ ఎప్పటికీ మర్చిపోలేని సినిమా ‘మనం’. అక్కినేని నాగేశ్వర రావు గారి చివరి చిత్రంగా వచ్చిన సినిమా అప్పట్లో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది. ఈ సినిమా విడుదలైన కొద్దీ రోజులకు నాగేశ్వర రావు గారు స్వర్గస్తులు అయ్యారు. అయితే ఈ సినిమాలో అక్కినేని నాగ చైతన్య పోషించిన పాత్ర కోసం ముందుగా జూనియర్ ఎన్టీఆర్ ని సంప్రదించారు అట. కథ అద్భుతంగా ఉంది, ఒకేసారి నాగేశ్వర రావు గారితో, నాగార్జున గారితో నటించిన అనుభవం దక్కుతుంది అని ఎన్టీఆర్ వెంటనే ఓకే చెప్పేశాడట. డేట్స్ కూడా ఇచ్చేసాడు, కానీ అమల కి మాత్రం ఈ సినిమా మొత్తం అక్కినేని కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఉంటే బాగుంటుంది కదా అని నాగార్జున తో అనింది అట.

ఈ ఆలోచన చాలా అద్భుతంగా ఉంది అని నాగార్జున అన్నాడట. మరి ఇప్పుడు ఎలా ఎన్టీఆర్ డేట్స్ తీసేసుకున్నాం, మళ్ళీ వద్దు అంటే ఫీల్ అవుతాడు కదా అని అమల అనగా, తారక్ తో నేను మాట్లాడుతాను అని చెప్పి, వెంటనే ఎన్టీఆర్ కి ఫోన్ చేసి, ఇలా చైతు డేట్స్ ఖాళీగా ఉన్నాయి, ఈ చిత్రం తాను చేస్తే అక్కినేని మూడు తరాలు కలిసి నటించినట్టు అవుతుంది తారక్, ఏమి అనుకోకు మనం వేరే సినిమా చేద్దాం అని అన్నాడట నాగార్జున. ఎన్టీఆర్ కి కోపం వచ్చినప్పటికీ, నాగార్జున మీద గౌరవం సైలెంట్ గా ఈ చిత్రం నుండి తప్పుకున్నాడు. ఈ సినిమా తర్వాత వచ్చిన ‘ఊపిరి’ చిత్రం లో కార్తీ పోషించిన పాత్ర కోసం ముందుగా ఎన్టీఆర్ ని అడగగా, ఆయన మనం సినిమా సమయం లో జరిగింది గుర్తుపెట్టుకొని వెంటనే నో చెప్పేశాడట.

366 views