జనసేనకు ‘జూనియర్ ఎన్టీఆర్’ మద్దతు..!

Posted by venditeravaartha, June 24, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ( Pawan Kalyan )ఓ వైపు సినిమాల్లో.. మరోవైపు రాజకీయాల్లో బిజీగా మారారు. ఏపీలో వచ్చే ఏడాదిలో ఎన్నికలు ఉన్నందున ఇటీవల ఆయన ‘వారాహి’ యాత్ర మొదలుపెట్టిన విషయం తెలిసిందే.ఈ సందర్భంగా రాజకీయాలతో పాటు సినీ ఇండస్ట్రీ గురించి మాట్లాడారు. సినిమా ప్రపంచం ఎలా ఉంది? సినిమాలకు రాజకీయాలకు ఉన్న సంబంధమేంటి? అనే విషయాలపై ప్రజలతో పంచుకున్నారు. ఇండస్ట్రీలో ఉన్న హీరోలంతా కలిసే ఉంటారని, ఫ్యాన్స్ కూడా కలిసి ఉండాలని ఆయన కోరారు. తనకు కొందరు ఫ్యాన్స్ మధ్య గొడవలు ఉన్నాయని చెప్పారని, కానీ అలా చేయొద్దని సూచించారు. పవన్ చేసిన ఇలాంటి వ్యాఖ్యలతో జూనియర్ ఎన్టీఆర్ ( Jr NTR ) ఫ్యాన్స్ పిదా అయిపోయారు. జనసేనకు తమ మద్దతు ఉంటుందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పవన్ రాజకీయాలపై సీరియస్ గా దృష్టి పెట్టారు. ఇందులో బాగంగా ఆయన వారాహి విజయ యాత్ర ద్వారా ప్రజలను కలుసుంటున్నారు. గతంలో కంటే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న పవన్ సినీ ఇండస్ట్రీ మద్దతు కోసం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ రాజకీయాల్లోకి వచ్చినప్పుటి నుంచి సినీ ప్రస్తానవ ఎన్నడూ తీసుకురాలేదు. కానీ ఇటీవల ఆయన ఇండస్ట్రీ గురించి మాట్లాడడం చూస్తే హీరోల మద్దతు కోసమేనన్న వాదన వినిస్తోంది. కాకినాడ జిల్లా కత్తిపూడిలో మొదలుపెట్టిన పవన్ వారాహి యాత్ర జూన్ 23న అమలాపురం కు చేరింది. ఇక్కడ జనసేన నాయకులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ సినిమాలకు సంబంధించి ఏ హీరోనైనా అభిమానించాలని, అందరినీ గౌరవించాలని అన్నారు. మేం వేర్వేరు సినిమాల్లో నటించినా ఫంక్షన్లలో అంతా కలిసే ఉంటామని అన్నారు. కొందరు తనకు పవన్ ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ గొడవలు పెట్టుకున్నారని చెప్పారని, అలా ఎన్నటికీ చేయొద్దని అన్నారు.

తాను చిరంజీవి(Chiranjeevi), బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు( Maheshbabu ) సినిమాలు చూస్తానని అన్నారు. ప్రభాస్ తనకంటే పెద్ద హీరో అని పవన్ అన్నారు. ప్రతి ఒక్క హీరో ఒకరికొకరు గౌరవించుకుంటారని అన్నారు. అలాంటప్పుడు ఫ్యాన్స్ గొడవ పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నారు. సినిమా అనేది వినోదం వరకేనని.. దానిని రాజకీయంతో ముడిపెట్టవద్దని అన్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో సినీ హీరోలంతా తనతో కలిసి రావాలని పవన్ పరోక్షంగా వ్యాఖ్యలు చేయడం ఆసక్తిగా మారింది. ఈ సందర్భంగా పవన్ చేసిన వ్యాఖ్యలతో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పవన్ కు మద్దతుగా పోస్టులు పెట్టి హల్ చల్ చేస్తున్నారు.

Tags :
737 views