Devara : షూటింగ్ దశలో ఉన్నప్పుడే 130 కోట్లు..’దేవర’ ఊచకోత మొదలైంది!

Posted by venditeravaartha, September 26, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎంతో ప్రతిష్టాత్మంగా తీసుకుని నటిస్తోన్న సినిమా దేవర. కొరటాల శివ తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా రిలీజ్ కు మరో ఆరు నెలల సమయం మాత్రమే ఉంది. వచ్చే ఏడాది ఏప్రిల్ నెల 5వ తేదీ తమకు పండుగ రోజని ఎన్టీఆర్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. కచ్చితంగా దేవర సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందని వారు అంటున్నారు. ఈ సినిమాతో దివంగత నటి శ్రీదేశి కూతురు జాన్వీకపూర్ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇప్పటికే విడుదలైన అప్ డేట్స్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ఇలా ఉండగా తాజాగా వచ్చిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తోంది.

దేవర సినిమా నాన్ థియేట్రికల్ హక్కులకు ఊహించని స్థాయిలో డిమాండ్ వస్తోందంటూ తెలుస్తోంది. ఈ సినిమా రైట్స్ ఏకంగా రూ.130 నుంచి 140 కోట్లకు అమ్ముడయ్యాయని సమాచారం. ఇందుకు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కూడా ఓ కారణం అంటున్నారు. ఆయన ఇటీవల జైలర్, జవాన్ సినిమాలకు మ్యూజిక్ అందించారు. ఆ సినిమాల్లో పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాలను ఓ రేంజ్ కు తీసుకెళ్లి బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురించాయి. ఆయన ఈ సినిమాకు పని చేయడం కలిసొచ్చిందంటున్నారు. నాన్ థియేట్రికల్ హక్కుల ద్వారానే ఈ సినిమా బడ్జెట్ లో దాదాపుగా సగం రికవరీ అయినట్టేనని తెలుస్తోంది.

దానికి తోడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబో కావడంతో సినిమాకు ఈ రేంజ్ లో బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయంటున్నారు. ఇప్పటి వరకు ఓ లెక్క ఇప్పటి నుంచి ఓ లెక్కలా తారక్ దేవర సినిమా ఉంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా దేవర సినిమాలో అండర్ వాటర్ సీక్వెన్స్ లు ఈ సినిమాకు హైలెట్ గా నిలుస్తాయని తెలుస్తోంది. దీంతో దేవర సినిమా విడుదలకు ముందే భారీ లాభాలు తెచ్చిపెట్టడం గ్యారంటీ అని పరిశ్రమకు చెందిన వారు భావిస్తున్నారు. ఇక పోతే చాలా ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నారు. ఇది కూడా సినిమాను మరో రేంజ్ కు తీసుకెళ్తోంది. అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా దర్శకుడు కొరటాల శివ చిత్రాన్ని చాలా గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోరుకున్న ఇండస్ట్రీ హిట్ దేవర సినిమా కచ్చితంగా తెచ్చిపెడుతుందని కామెంట్స్ వస్తున్నాయి.

223 views