యంగ్ హీర నిఖిల్ అంటే ఒకప్పుడు ఓన్ల లవ్ చిత్రాలు మాత్రమే తీస్తాడనే పేరుంది. కానీ కార్తీకేయ చిత్రం ఆయన కెరీర్ ను మలుపు తిప్పిందనే చెప్పొచ్చు. అప్పటి నుంచి సోషియో పాంటసీ చిత్రాలు తీస్తూ ప్రత్యేకంగా నిలుస్తున్నాడు. ఇటీవల ఆయన నటించిన కార్తీకేయ 2 తో నిఖిల్ ఆల్ టైం యాక్షన్ హీరో అనిపించుకున్నాడు. కార్తీకేయ 3 కూడా ఉంటుందని ఆ మూవీ ఎండింగ్ లో చెప్పారు. ఈ తరుణంలో నిఖిల్ ‘స్పై’ మూవీతో జూన్ 29న థియేటర్లోకి రాబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ సైంటిఫిక్ థ్రిల్లర్ గా ఉంటుందని అర్థమైంది. ఇటీవలే దీని ట్రైలర్ కూడా రిలీజ్ చేయడంతో సినిమా కథ కూడా అర్థమైంది. అయితే లేటేస్టుగా సెన్సార్ బోర్డుఈ చిత్రంపై ఆసక్తికర రివ్యూ చెప్పింది. ఆ విశేషాలేంటో చూద్దాం.
గ్యారీ బీ హెచ్ డైరెక్షన్లో వస్తున్న స్పై మూవీ టోటల్ యాక్షన్ మూవీ అని ట్రైలర్ చూస్తే అర్థమైంది. అజాద్ హిందూ దళపతి సుభాస్ చంద్రబోస్ మరణం ఇప్పటికీ మిస్టరీగా ఉందని, ఆయన విమాన ప్రమాదంలో మరణించారనే వాదన ఉంది. కానీ ఆయన మరణం వెనుక అనేక రహస్యాలు ఉన్నాయని ట్రైలర్లో వినిపించారు. దీంతో నేతాజీ మరణంపై ఈ సినిమా నడుస్తుందని అర్థమువుతుది. అయితే లేటేస్టుగా సెన్సార్ బోర్డు ఈ చిత్రాన్ని చూసి ఆసక్తికర కామెంట్స్ చేసింది.
స్పై మూవీకి ఎలాంటి కట్స్ లేకుండా యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ సందర్భంగా బోర్డు సభ్యులు మాట్లాడుతూ సినిమా బాగుంది.. అని అననారు. ఉన్నతమైన విలువలతో సినిమాను నిర్మించారని, దీనిని కచ్చితంగా ప్రేక్షకులు ఆదరిస్తారని చెప్పారు. ఆడియన్స్ ఈ సినిమాతో థ్రిల్లుగా ఫీలవుతారని, ట్విస్టులతో మూవీ మొత్తం ఆకట్టుకుంటుందని అన్నారు. మొత్తంగా స్పై మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చెప్పారు.
సెన్సార్ బోర్డు చెప్పిన రివ్యూతో నిఖిల్ సంతోషంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనకు ఈ సినిమా హిట్టయితే వరుసగా రెండో మూవీ హిట్టయినట్లు రికార్డు నమోదవుతుంది. కథలను జాగ్రత్తగా ఎంచుకొని నిఖిల్ సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ సినిమా అనుకున్నట్లు సక్సెస్ అయితే నెక్ట్ష్ ఇలాంటి సినిమాలే ఎక్కవగా చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇదిలా ఉండగా స్పై మూవీలో నిఖిల్ కు జోడీగా ఐశ్వర్య మీనన్ నటిస్తోంది. దగ్గుబాటి రానా ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు.