Nikhil: RRR ఒక్క చెత్త సినిమానా..హీరో నిఖిల్ షాకింగ్ కామెంట్స్

Posted by venditeravaartha, May 17, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

టాలీవుడ్ లో ఇప్పుడు ఉన్న యువ హీరో ల లో నిఖిల్(Nikhil) ది ప్రత్యేకమైన స్టైల్ ..వైవిధ్యమైన కథ ల తో వరుస బ్లాక్ బస్టర్ హిట్లు సాధించడమే కాకుండా కార్తికేయ 2 సినిమా తో పాన్ ఇండియా స్థాయి లో తన ఇమేజ్ ని మార్కెట్ ని పెంచుకున్నారు..ఇక ఇప్పుడు ఇండియన్స్ బెస్ట్ కెప్ట్ సీక్రెట్ అంటూ సుభాష్ చంద్రబోస్ గారి డెత్ మిస్టరీ ని సినిమా గా తీస్తున్నారు..ఈ సినిమా టీజర్ ని ఢిల్లీ లోని సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహం దగ్గర రిలీజ్ చేసారు.నిఖిల్ కి కార్తికేయ 2 తో హిందీ లో మంచి మార్కెట్ ఏర్పడింది,దింతో ఈ ‘స్పై’ సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి.క్షణం,గూఢచారి,ఎవరు,హిట్ లాంటి సినిమా ల కి అసిస్టెంట్ డైరెక్టర్ ,ఎడిటర్ ల గా పని చేసిన Garry Bh స్పై(Spy) సినిమా ద్వారా డైరెక్టర్ గా తన మొదటి సినిమా ని చేస్తున్నారు.ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యేక ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశం లో విలేకర్లు అడిగినా ప్రశ్నల కి సమాధానం ఇచ్చే టైం లో #RRR సినిమా మీద విలేకర్లు చేసిన కొన్ని వ్యాఖ్యలకు నిఖిల్ స్ట్రాంగ్ గా రిప్లై ఇచ్చారు.

సుభాష్ చంద్రబోస్ గారి డెత్ మిస్టరీ మీద రాబోతున్న ‘స్పై’ మూవీ ని రాజమౌళి గారి RRR తో పోల్చుతూ రాజమౌళి ఇద్దరు గొప్ప స్వతంత్ర సమరయోధుల పేర్లు పెట్టి వారి చరిత్ర ని తీస్తాను అని చెప్పిన రాజమౌళి టోటల్ ఫిక్షన్ తీసి వారి పేర్లను చెడగొట్టారు అని..RRR మూవీ ఒక అబద్ధం అని అడుగుతూ,RRR మూవీ లాగానే మీరు కూడా సుభాష్ చంద్రబోస్ గారి పేరు చెప్పి జరిగిన స్టోరీ తీస్తారా లేక ఫిక్షన్ తీస్తారా అని అడిగిన ప్రశ్న కి సమాధాం ఇస్తూ RRR మూవీ ఓకే ఎపిక్ బ్లాక్ బస్టర్ ఆ సినిమా కి ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది ,,రాజమౌళి గారికి ,ఆ మూవీ టీం అందరికి నా అబినందనలు..అలాంటి గొప్ప సినిమా గురించి తక్కువ గా మాట్లాడటం కరెక్ట్ కాదు అని అన్నారు.

ఇక తమ ‘స్పై’ సినిమా పూర్తిగా సుభాష్ చంద్రబోస్ గారి మీదనే ఉంటుంది.1945 నుంచి 1970 వరకు కూడా చాల మంచి స్పై లు ఆయన డెత్ సీక్రెట్ ని బయట పెట్టడానికి చాల ట్రై చేసారు మరి అసలు ఏమి జరిగింది అనేది ఎవరికీ కూడా క్లారిటీ లేదు..ఆ సీక్రెట్ ని అందరికి తెలియా చేయడానికి మాకు ఒక అవకాశం లభించింది.ఇండియన్ బెస్ట్ కెప్ట్ సీక్రెట్ ని జూన్ 29 న తెలియాచేయనున్నాం అన్నారు.

Tags :
732 views