టాలీవుడ్ లో తన కంటూ ప్రత్యకమైన స్టైల్ ఏర్పర్చుకుని అందరిలాగా కమర్షియల్ సినిమా లు కాకుండా కంటెంట్ బేస్ సినిమా లు చేస్తూ పాన్ ఇండియన్ రేంజ్ కి ఎదిగారు నిఖిల్ సిద్దార్ధ్..
2013 లో రిలీజ్ అయినా స్వామి రా రా నుంచి విభిన్నమైన కథ ల తో సూపర్ సక్సెస్ ని చూసిన నిఖిల్ ఇటీవల రిలీజ్ అయినా కార్తికేయ 2 తో తెలుగు రాష్ట్రాల తో పాటు యావత్ ఇండియా లో తన మార్కెట్ ని పెంచుకున్నాడు.తన కెరీర్ లో 100 కొట్ల పైన కలెక్ట్ చేసిన కార్తికేయ 2(Karthikeya2) తో హిందీ లోను మంచి మార్కెట్ ని ఓపెన్ చేసుకున్నాడు.
కార్తికేయ 2 తో పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్(Nikhil) 18 పేజెస్ తో మరో సక్సెస్ ని అందుకున్నాడు.తన తదుపరి చిత్రం అయినా స్పై(Spy) తో ఇండియన్స్ మోస్ట్ సీక్రెట్ గ చెప్పుకునే సుభాష్ చంద్రబోస్ గారి డెత్ మిస్టరీ ని చూపించనున్నారు.ఈ సినిమా కోసం తెలుగు రాష్ట్రాల తో పాటు నార్త్ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరియు యూవీ ఫిలిమ్స్ కాంబినేషన్ లో కొత్తగా రానున్న వి మెగా పిక్చర్స్ బ్యానర్ లో రానున్న ది ఇండియా హౌస్ పాన్ ఇండియన్ మూవీ లోను నిఖిల్ చేయనున్నారు.
స్పై ,ది ఇండియా హౌస్(The india house) పాన్ ఇండియన్ సినిమా ల తో బిజీ గా ఉన్న నిఖిల్ తన మరో ప్రాజెక్ట్ ని కూడా స్టార్ట్ చేసాడు.భరత్ కృష్ణమాచారి డైరెక్షన్ రాబోతున్న మరో పాన్ ఇండియన్ మూవీ ‘స్వయంభు’ షూటింగ్ కూడా మొదలు అయినట్లు ప్రకటించారు.ప్రస్తుతం నిఖిల్ చేతిలో 3 పాన్ ఇండియా మూవీస్ ఉన్నాయి.ఇక ఇవి కాకుండా తనకి సూపర్ సక్సెస్ ని ఇచ్చిన కార్తికేయ సిరీస్ నుంచి కార్తికేయ 3 కూడా చర్చల్లో ఉంది.
ఇన్ని వరుస పాన్ ఇండియన్ సినిమా ల తో బిజీ గా ఉన్న నిఖిల్ దీపం ఉన్నపుడు ఇల్లు చక్క దిద్దుకోవాలి అనే ఫార్ములా ని పట్టుకున్నాడు కార్తికేయ 2 వరకు ఉన్న తన రెమ్యూనిరేషన్ ని ఆ తర్వాత డబుల్ చేసాడు.ఇక దానితో పాటు సినిమా లాభాల లో షేర్ కూడా అడుగుతున్నాడు అని సమాచారం.నిఖిల్ తన రాబోయే పాన్ ఇండియన్ సినిమా లు అయినా ది ఇండియా హౌస్ ,స్వయంభు(Swayambhu) ,కార్తికేయ 3 ల కోసం 10 నుంచి 15 కొట్ల మేర డిమాండ్ చేస్తున్నాడు అని సమాచారం.