Niharika Konidela : మెగా డాటర్ అంటే ఇండస్ట్రీకి వచ్చిన నిహారిక కొణిదెలా మొదట సినిమాలు తర్వాత వెబ్ సిరీస్ చేశారు. మెగా ఫ్యామిలీ నుండి ఎవరు ఇండస్ట్రీకి వచ్చిన వారిని అభిమానులు ఆదరిస్తూనే ఉన్నారు. ఇక మెగా డాటర్ నిహారికని కూడా అభిమానులు అలానే ఆదరించారు నాగబాబు కూతురుగా వరుణ్ సోదరిగా, నిహారిక అందరికీ పరిచయమే, ఇక నిహారిక తనలో ఉన్న టాలెంట్ ని బయటపెట్టి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. హీరోయిన్ గా కొన్ని సినిమాలలో మెప్పించారు నిహారిక.
నిహారిక నిత్యం తన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఎప్పటికప్పుడు అభిమానంతో టచ్ లో ఉంటారు ప్రస్తుతం కొన్ని సినిమాలను లైన్లో పెట్టారు నిహారిక నిర్మాతగా హీరోయిన్ గానే కాక యాంకర్ గా కూడా బిజీగా గడుపుతున్న నిహారిక. ప్రస్తుతం రీసెంట్గా ఆహ్వాలో చెఫ్ మంత్రా సీజన్ 3 లో యాంకర్ గా చేస్తున్నారు. తాజాగా వచ్చే ఎపిసోడ్ ప్రోమో ఒకటి రిలీజ్ అయింది ఈ ప్రోమోలో హీరో సుహాస్, నటి శరణ్య పాల్గొన్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీ సక్సెస్ అందుకుంది వీరిని నిహారిక చీఫ్ గెస్ట్ గా పిలిచారు.
ఇక ఈ షోలో నిహారిక కొన్ని ప్రశ్నలను నటి శరణ్యకి సుహాస్ కి ఇచ్చి చదవమని చెప్తుంది మొదట సుహాస్ చదివిన ప్రశ్న మీరు డాష్ లేకపోతే ఉండలేరా? ఆ ప్రశ్న చదవగానే సుహాస్ నవ్వుతాడు ఇక ఆ తర్వాత శరణ్యాన్ని చదవమనగా శరణ్య తన చేతిలో ఉన్న ప్రశ్నలు చదువుతూ మీరు ఇష్టంగా డాష్ చేసింది ఎవరితో అని చదువుతుంది. వెంటనే అక్కడున్న వాళ్లు కూడా నవ్వుతూ ఉంటారు ఇక సుహాస్ కూడా నవ్వుతూ ఆయన ఏం చేస్తాడు పాపం అని అంటాడు వెంటనే శరణ్య ఓరయ్యా నీకు దండం పెడతాను ఆపేసే అని అంటుంది. తరువాత నిహారిక వీరితో వంటలు చేయిస్తుంది కొన్ని గేమ్స్ కూడా ఆడిస్తుంది. ఇప్పుడు ఈ షో ప్రోమో చూసిన వారంతా రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు అసలు షో లో అడగాల్సిన ప్రశ్నలు ఇవేనా అని,ఇలాంటి ప్రశ్నలతో ప్రోమో విడుదల చేశారు అని రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.