స్వాతిముత్యం సినిమా తో ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకున్న బెల్లంకొండ గణేష్(Ganesh) ఇప్పుడు తన రెండవ సినిమా ని మంచి సస్పెన్స్ థ్రిల్లర్ గా తీసుకుని వచ్చాడు.నేను స్టూడెంట్ సార్(Nenu student sir) అంటూ జూన్ 2 న ప్రపంచ వ్యాప్తముగా రిలీజ్ అయినా ఈ సినిమా లో అవంతిక హీరోయిన్ గా చేయగా సునీల్ ,సముద్రఖని,ఆటో రాంప్రసాద్ ముఖ్య పాత్రలుగా కనిపించారు.తన రెండవ సినిమా తో అన్ని రకాల ఆడియన్స్ ని గణేష్ మెప్పించాడా లేదా చూద్దాం.
కథ: సుబ్బు (గణేష్ బెల్లంకొండ) కాలేజీ స్టూడెంట్ తనకి చిన్నతనం నుంచి ఐ ఫోన్ అంటే పిచ్చ ఇష్టం దానితో ఎలా అయినా ఐ ఫోన్ కొనాలి అనుకుంటూ ఉంటాడు. కానీ అతని ఆర్థిక సామర్థ్యం ఐ ఫోన్ 12 కొనడానికి సహకరించదు . చిన్నగా తాను కస్టపడి సుబ్బు చివరకు తాను సంపాదించిన డబ్బుతో ఐ ఫోన్ 12 కొంటాడు. అయితే అతని దరిద్రం ఏంటి అంటే ఆ మొబైల్ వలెనే అతను ఒక మర్డర్ కేసు లో చిక్కుంటాడు.ఆ సమస్య నుంచి బయటకి వచ్చే లోపే మరో షాక్ తగులుతుంది.. అతని బ్యాంక్ ఖాతాలో 1.75 కోట్లు క్రెడిట్ అవుతాయి.అసలు మర్డర్ కేసులో సుబ్బు ఎలా చిక్కుకున్నాడు? ఇంత మొత్తంలో సుబ్బు ఖాతాలో ఎవరు జమ చేశారు? సుబ్బు ఎలాంటి కష్టాలు పడ్డాడు? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ:కాలేజీ స్టూడెంట్ గా గణేష్ న్యాచురల్ గా నటించాడు.క్లైమాక్స్ లో వచ్చే సీన్ ల తాను తన పాత్రా కి పూర్తిగా న్యాయం చేసాడు అనిపిస్తుంది.డైరెక్టర్ ప్రస్తుతం సమాజం లో ఉన్నఆన్ లైన్ మోసాల గురించి మంచి అవగాహనా తో ఈ సినిమా చేసినట్లు తెలుస్తుంది.ఇందులో సునీల్ క్యారెక్టర్ తో సినిమా కి మంచి హైప్ వస్తుంది అనే చెప్పాలి .సునీల్ ఎంట్రీ తో సినిమా మరో లెవెల్ కి వెల్తుంది.ఇక ఎప్పటిలాగే సముద్రఖని తన నటన తో మెప్పించాడు.సినిమా కి మేజర్ గా మ్యూజిక్ మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ గా నిలిచాయి.ఫస్ట్ హాఫ్ లో కొంచెం కామెడీ ఉన్న సెకండ్ హాఫ్ కి మంచి సస్పెన్స్ థ్రిల్లర్ గా మలిచి మంచి మార్కులే కొట్టారు.
పాజిటివ్:గణేష్,కథ,స్క్రీన్ ప్లే ,సునీల్,బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్,క్లైమాక్స్.
నెగటివ్:ఫస్ట్ హాఫ్ ,కొన్ని లాగ్ సీన్ లు.
రేటింగ్:3 .25 / 5