NBK:బాలయ్య తో బలగం మూవీ డైరెక్టర్ వేణు సినిమా ! వేణు కి మరో ఛాన్స్ ఇచ్చిన దిల్ రాజు !

Posted by venditeravaartha, May 10, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

నటసింహం నందమూరి బాలకృష్ణ తన సినీ కెరీర్ లో ఎంతో మంది టాప్ డైరెక్టర్ ల తో పని చేసారు ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు సాధించారు.ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్ లో NBK108
లో చేస్తున్న బాలయ్య బాబు తన తదుపరి చిత్రాన్ని బోయపాటి శీను డైరెక్షన్ లో చేయనున్నారు అయితే ఇప్పుడు బాలకృష్ణ కి సంబంధించిన న్యూస్ ఒకటి తెగ వైరల్ అవుతుంది.

జూన్ 10 నా నటసింహం బాలకృష్ణ గారి పుట్టినరోజు ,ఆ రోజు నా బాలయ్య బాబు రెండు సినిమా ల ను అధికారకంగా ప్రారంభించనున్నారు.అందులో ఒకటి బోయపాటి శీను గారితో ఉండగా మరొక ప్రాజెక్ట్ ఎవరు ఊహించని విధంగా కమెడియన్ అయినా వేణు డైరెక్షన్ లో ఉండబోతుంది.మొదట్లో అసిస్టెంట్ రైటర్ గా సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన వేణు ఆ తర్వాత కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్నారు,టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అయినా దిల్ రాజు గారు వరుసగా పెద్ద సినిమా లు చేస్తున్నారు,ఇప్పటికే రామ్ చరణ్ తో RC15 ఉండగా తన తదుపరి చిత్రాలని కూడా స్టార్ హీరో ల తో ప్లాన్ చేస్తున్నారు అందులో భాగం గానే బాలయ్య బాబు తో ఒక సినిమా ని ఓకే చేసుకున్నారు.ఇటీవల అతి తక్కువ బడ్జెట్ తో తీసి బ్లాక్ బస్టర్ హిట్ ని ఇచ్చిన బలగం సినిమా డైరెక్టర్ వేణు ని ఈ సినిమా కి డైరెక్టర్ గా ఓకే చేసారు.

వేణు ఇది వరకే చెప్పినట్లు తన దగ్గర రెండు ,మూడు కమర్షియల్ స్టోరీ లు ఉన్నాయి ,ఎవరు అయినా పెద్ద హీరో లు ఒప్పుకుంటే వారితో తీయడానికి రెడీ గా ఉన్నాను అన్నారు.మరి ఇప్పుడు నటసింహం బాలయ్య బాబు గారితోనే సినిమా ఛాన్స్ రావడం అది కూడా దిల్ రాజు బ్యానర్ కావడం తో వేణు ఎలాంటి సినిమా తీయబోతున్నారు అనేది హాట్ న్యూస్ అయింది.

5776 views