సౌత్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోయిన్లలో నయనతార (Nayanthara) ఒకరు.తెలుగు, తమిళ సినిమాల్లోబిజీ అయిన ఈమె ఏడాది కిందట డైరెక్టర్ విఘ్నేష్ ను పెళ్లి చేసుకుంది. ఇంట్లోవాళ్లకు ఇష్టం లేకుండానే అతికొద్ది మంది సమక్షంలో పెళ్లి చేసుకున్నఈ దపంతులు కొన్నినెలల కిందట సరోగసి ద్వారా కవలలకు జన్మనిచ్చింది. ఈ సమయంలో ఓ వివాదంలో ఇరుక్కున్న నయనతార ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. తాజాగా మరో చిక్కుల్లో పడింది ఈ స్టార్ హీరోయిన్. తన భర్త విఘ్నేష్ వాళ్ల చిన్నాన్న తమ ఆస్తులను అక్రమంగా విక్రయించారని ఆరోపిస్తూ నయన్ దంపతులపై కేసు పెట్టాడు. వాటి వివరాల్లోకి వెళ్తే..
తమిళనాడులోని తిరుచ్చి జిల్లా లాల్ కుడి గ్రామంలో విఘ్నేష్ పూర్వీకులకు ఆస్తులు ఉండేవి.విఘ్నేష్ తండ్రి శివకొళుదు ప్రస్తుతం లేరు. వీళ్లు 9మంది అన్నదమ్ములు. శివకొళుదు బతికున్నప్పుడు అన్నదమ్ములకు సంబంధించిన ఆస్తులను అమ్ముకున్నట్లు ఆయన సోదరుడు కుంచిత పాదం ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఆయన 2023 జూలై 6న తిరుచ్చి డీఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అయితే శివకొళుదు లేనందున ఆయన కుమారుడు విఘ్నేష్ శివన్ దంపతులపై ఆయన ఫిర్యాదు చేశారు. ఇందులో విఘ్నేష్ శివన్ తల్లి మీనా కుమారి పేరుకూడా చేర్చారు.
ఈ సందర్భంగా కుంచితపాదం మట్లాడుతూ తమ ఉమ్మడి ఆస్తిని విఘ్నేష్ శివన్ తండ్రి అక్రమంగా విక్రయించాడని, తమ ఆస్తిని కొనుగోలు చేసిన వారికి తిరిగి డబ్బు ఇచ్చి ఉమ్మడి ఆస్తి అప్పగించేలా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుదారుడు కోరాడు. దీంతో డీఎస్పీ ఈ కేసు వివరాలు చేబట్టాలని కిందిస్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. మొన్నటి వరకు పలు వివాదాల్లో చిక్కుకున్న నయనతార ఇప్పుడు మరో వివాదంలో మునిగిపోవడంతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. సినిమాలతో బిజీగా ఉన్న నయనతార పెళ్లి తరువాత కాస్త రిలాక్స్ అయింది. ఆ తరువాత ఇద్దరు పిల్లలతో ఎంతో సంతోషంగా జీవిస్తోంది. అయితే వీరు అక్రమంగా సరోగసి ద్వారా పిల్లలను పొందారని కొందరు కోర్టుకెక్కారు. ఆ కేసు కొన్నాళ్ల పాటు సాగింది. ఆ తరువాత కోర్టు వీరికి క్లీన్ చీట్ ఇచ్చింది. తిరిగి ఇప్పుుడు మరో కేసును నయనతార ఎలా ఎదుర్కొంటారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.